కిర్గిజిస్థాన్‌ చేరుకున్న ప్రధాని మోడీ

0

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ

న్యూఢిల్లీ : కిర్గిజిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌తో సమావేశమయ్యారు. ధ్వైపాక్షిక సత్సంబంధాల బలోపేతంపై వారు చర్చించారు. భారత ప్రధానిగా మోదీ రెండో సారి ఎన్నికైన తర్వాత ఇరు నేతల మధ్య తొలిసారి జరిగిన సమావేశం ఇది. చైనాతో స్నేహం మరింత బలపడుతోంది. ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా మోదీ ఇక్కడ తన తొలి సమావేశాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌తో జరిపారు. ధ్వైపాక్షిక బంధం మరింత బలపడే దిశగా ఇరు నేతలు చర్చలు జరిపారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌లో పేర్కొంది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అవలంబిస్తున్న వాణిజ్య విధానాలు, టారిఫ్‌లను ఓ ఆయుధంగా వినియోగిస్తుండడం పట్ల వ్యతిరేకత తెలుపుతూ తమ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ దేశాలను ఏకం చేసే అవకాశం ఉందని చైనా ఇటీవల హింట్‌ ఇచ్చింది. ఆ ఇరుదేశాల మధ్య ఇటీవల వాణిజ్య యుద్ధం మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఎస్‌సీఓలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం బిష్కెక్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు దేశాల అగ్రనేతలతో ఆయన భేటీ అవుతారు. ఎస్‌సీఓలో భారత్‌, పాకిస్థాన్‌ 2017లో సభ్యత్వాలను పొందాయి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here