ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు

    0

    న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కలాంశాట్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన తన ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. సూక్ష్మ గురుత్వాకర్షణ (మైక్రోగ్రావిటీ)పై ప్రయోగాల కోసం అంతరిక్ష వేదికగా నాలుగో దశ స్పేస్‌ రాకెట్‌ను ఉపయోగిస్తున్న తొలిదేశంగా భారత్‌ నిలిచిందన్నారు. పీఎల్‌ఎల్‌వీ-సీ44 రాకెట్‌ ద్వారా గురువారం రాత్రి నింగిలోకి రెండు ఉపగ్రహాలను పంపారు. కలాంశాట్‌తో పాటు మైక్రోశాట్‌-ఆర్‌ ఉన్నాయి. సతీష్‌

    ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి రాత్రి 11.37 నిమిషాలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంతో విద్యార్థులు తయారు చేసిన కలాంశాట్‌ ఉపగ్రహన్ని నింగిలోకి పంపారని, మైక్రోగ్రావిటీ పరీక్షల కోసం ఇస్రో చేస్తున్న కృషి అభినందనీయం అని ప్రధాని మోదీ అన్నారు. అంతరిక్షరంగంలో వరుసగా ఘనవిజయాలు సాధిస్తున్న ఇస్రో తనకు తిరుగులేదని మరోమారు చాటుకుంది. అనేక రకాల ప్రయోగాలతో ఇప్పటికే ప్రపంచ పటంలో అభివృద్ది చెందిన దేశాల సరసన భారత్‌ను నిలిపింది. ప్రయోగాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఇస్రో అంతరిక్ష చరిత్రలో కొత్త చరిత్రను లిఖిస్తోంది. సైనిక అవసరాల కోసం తయారుచేసిన మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ 44 రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతోపాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఉపగ్రహం కలాంశాట్‌ను కూడా తన వెంట తీసుకెళ్లింది. 28 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం గురువారం రాత్రి 11.37కు శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో ఉన్న మొదటి ల్యాంచ్‌పాడ్‌ నుంచి పీఎస్‌ఎల్వీసీ 44 గగనతలంలోకి దూసుకెళ్లింది. ప్రశాంతమైన వాతావరణం, గగనతలంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాల సాక్షిగా ఇస్రో నమ్మినబంటైన పీఎస్‌ఎల్వీ మరోమారు తనపై శాస్త్రవేత్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. రెండు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాదిలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. పీఎస్‌ఎల్వీకి ఇది 46వ ప్రయోగం. పీఎస్‌ఎల్వీ మోసుకెళ్లిన మైక్రోశాట్‌-ఆర్‌ బరువు 740 కిలోలు. ఇది ఇమేజింగ్‌ శాటిలైట్‌. దీంట్లో ఉండే శక్తిమంతమైన కెమెరాలతో ఫొటోలు తీస్తుంది. సైనిక అవసరాల కోసం దీనిని రూపొందించారు. గగనతలంలోకి ప్రవేశించిన 13 నిమిషాల 30 సెకన్ల అనంతరం 274 కి.విూ. దూరంలో ఉన్న పోలార్‌ సన్‌ సింక్రనస్‌ కక్ష్యలోకి మైక్రోశాట్‌-ఆర్‌ను పీఎస్‌ఎల్వీ సురక్షితంగా చేర్చింది. అనంతరం రాకెట్‌ నాలుగోదశ.. కలాంశాట్‌-వీ2ను మరింతపైకి తీసుకెళ్లింది. దీని నిర్దేశిత కక్ష్య భూమికి 450 కి.విూ.ల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరటానికి 90 నిమిషాలు పడుతుంది. కేవలం 10 సెంటీవిూటర్ల సైజులో 1.2 కిలోల బరువు మాత్రమే ఉండే కలాంశాట్‌-వీ2ను చెన్నైలోని స్పేస్‌కిడ్జ్‌ ఇండియా అనే ప్రైవేటుసంస్థకు చెందిన విద్యార్థులు తయారు చేశారు. దీనికి అయిన వ్యయం రూ.12 లక్షలు. ఆరు రోజుల్లో దీనిని రూపొందించారు. ఇప్పటివరకూ ప్రపంచంలో తయారుచేసిన ఉపగ్రహాల్లోకెల్లా ఇదే అత్యంత తేలికైనది. అత్యంత తేలికైన నానోశాటిలైట్‌లను కమ్యూనికేషన్స్‌లో ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై పరిశోధనలు నిర్వహించటానికి దీనిని ప్రయో గించారు. ఈ తరహా బుల్లి శాటిలైట్లు విపత్తు సమయాల్లో నిర్వహించే సహాయక చర్యల్లో ఉపయోగ పడనున్నాయి. దీనిని అంతరిక్షంలోకి తీసుకెళ్లటానికి ఇస్రో ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవటం విశేషం. 2017లో 64 గ్రాముల బరువున్న కలాంశాట్‌ తొలి వర్షన్‌ను రూపొందించారు. దీనికి గులాబ్‌జామూన్‌ అనే ముద్దుపేరు కూడా పెట్టారు. దీనిని నాసా ప్రయోగించింది. కానీ, అది నిర్దేశిత కక్ష్యను చేరలేదు. ఇస్రో ఈసారి ఒక కొత్త ప్రయోగం చేసింది. సాధారణంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్‌ చివరిదశ రోదసిలోనే ఉండి అక్కడ వ్యర్థపదార్థంగా మారిపోతుంది. కానీ, ఈసారి ఆ చివరిదశ రాకెట్‌ను కూడా ఉపయోగించుకునే వినూత్న టెక్నాలజీని ఇస్రో అభివృద్ధి చేసింది. నాలుగోదశ రాకెట్‌ ఉన్నత కక్ష్యలోకి వెళ్లి.. అక్కడ ఆర్బిటల్‌ ఎ/-లాట్‌ఫాం (వేదిక)లాగా ఉపయోగపడనుంది. తదనంతరకాలంలో ఇస్రో చేపట్టే ప్రయోగాలకు ఇది పనికొస్తుంది. అంతేకాదు, పీఎస్‌ఎల్వీ ప్రయోగానికి ఇస్రో ఈసారి కేవలం రెండు బూస్టర్లను మాత్రమే ఉపయోగించింది. ఇస్రో మాజీ అధిపతులు కస్తూరిరంగన్‌, కిరణ్‌కుమార్‌ కూడా

    ప్రయోగాన్ని దగ్గరుండి వీక్షించారు.

    విద్యార్థులు ఇస్రోకు వచ్చి ప్రయోగాలు చేయవచ్చు : శివన్‌

    ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపగ్రహాలు తయారుచేసుకుని, వాటిని ఇస్రోకు తీసుకువచ్చి ప్రయోగించవచ్చని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు విద్యార్థులు తయారుచేసిన కలాంశాట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేర్చామంటూ విద్యార్థులను అభినందించారు. సైన్స్‌ ప్రయోగాలపై యువత దష్టి పెట్టి విజ్ఞాన భారతంగా మార్చాలని ఆకాంక్షించారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here