Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

మోడీ ఏ 100 డేస్‌ – కీలక, సంచలన నిర్ణయాలు

నరేంద్ర మోదీ అధ్వర్యంలో… రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారంతో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా… నేటి నుంచీ కొన్ని రోజులపాటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్రలో మళ్లీ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నట్లు తెలిసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే అఖండ విజయాన్ని సాధించింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా అధికారం బాధ్యతలు చేపట్టారు. ఎవరూ ఊహించని విధంగా వంద రోజుల్లోనే మోదీ తన మార్క్‌ పాలనను ప్రజలకు చూపించాడు. పటిష్టమైన ప్రభుత్వం ఉండటంతో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోడానికైనా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారు. చారిత్రక సంస్కరణలు తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం సఫలమైంది. ట్రిపుల్‌ తలాక్‌, జమ్ముకశ్మీర్‌ ఆర్టికల్‌ 370 రద్దు, ఉగ్రవాద నిరోధక చట్టం వంటి చట్టాలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం రాజకీయ చతురతను ప్రదర్శించింది. ఇక ఓ వైపు దేశంలో ఇలాంటి సంస్కరణలను తీసుకువస్తూ.. మరోవైపు విదేశీ వ్యవహారాలకు కూడా అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి వంద రోజుల్లో 17 రోజులు విదేశీ పర్యటనల్లోనే గడిపారు. గతంలో ఏ ప్రధాని కూడా వెళ్లని దేశాల్లో మోదీ పర్యటించడం విశేషం. విదేశీ టూర్‌లలో ఆర్థిక, రక్షణ, విద్యుత్తు వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటూనే.. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగడుతూ.. పాక్‌ చేస్తున్న చర్యలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాక్‌ ఎంతగా గగ్గోలు పెట్టినా అంతర్జాతీయ సమాజం భారత్‌వైపే నిలబడి, ఆ దేశం వాదనను ఎవరూ పట్టించుకోకపోవడం మోదీ విదేశాంగ విధానం గొప్పతనమే. ఆ రాష్ట్రానికి కొన్ని కీలక ప్రాజెక్టుల్ని ప్రకటిస్తారని సమాచారం. వాటన్నింటినీ ఎన్నికలకు ముందే… ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించేలా ప్లాన్స్‌ ఉండబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీం చెప్పుకోతగ్గది. దీని ద్వారా వంట గ్యాస్‌ లేనివారికి కేంద్రం గ్యాస్‌ బండ, ఎల్‌పిజీ కనెక్షన్‌ ఉచితంగా ఇస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 8 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే… 6 నెలల ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంది.

ఈ సందర్భంగా... శనివారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మోడీ వంటగ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేస్తారని తెలిసింది. 2014తో పోల్చితే... 2019లో మోదీ 2.0 చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు... అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు మరింత గుర్తింపు వచ్చేలా చేసిందని చెప్పుకోవచ్చు. సంస్కరణల విషయంలోనూ మోదీ సర్కార్‌ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా... దూసుకెళ్లింది. ప్రధానంగా... లోక్‌ సభ ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకోవడంతో... కేంద్రంలో కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ ఓ రేంజ్‌లో పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్‌ స్థాయిని పెంచేందుకు 9 దేశాల్లో తిరిగిన మోదీ... వెళ్లిన ప్రతిచోటా... భారత ఖ్యాతిని మరింత పెంచారు. ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబధాల్ని మెరుగుపరిచారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌ విషయంలో ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటికీ... ఈ విషయంలో పాకిస్థాన్‌ కుట్రలు సాగనివ్వకుండా... అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి మద్దతు కూడగట్టటంలో కేంద్రం విజయం సాధించినట్లైంది. ప్రధానంగా మోడీ... ఎన్నికల్లో ఏ హావిూలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా ఈ 100 రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో ఆయన ఏమాత్రం వెనకడుకు వెయ్యకపోవడం విశేషం. కశ్మీర్‌ కు ప్రత్యేకయ ¬దా కల్పించే ఆర్టికల్‌ 370రద్దు,ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారిపై భారీగా ఫైన్‌ లు విధించేలా మోటర్‌ వెహికల్‌ చట్టానికి సవరణ చేయడం, త్రిపుల్‌ తలాక్‌ చట్టం అమల్లోకి తీసుకురావడం,ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, అవినీతిపై ఉక్కుపాదం,పోస్కో చట్టానికి సవరణ,ఫిట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం, ఆర్టీఐకి సవరణ,ఎమ్‌ సీఐ సవరణ బిల్లు అమల్లోకి  ఇలా వంద రోజుల పాలనలో మోడీ 2.0 అనేక కీలక,సంచలన, వివాదాస్పద నిర్ణయాలను తీసుకుంది.  ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటికీ ఈ విషయంలో పాకిస్తాన్‌ కుట్రలు సాగనివ్వకుండా... అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి మద్దతు కూడగట్టటంలో కేంద్రం విజయం సాధించింది.

అయితే ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కేంద్ర ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది. బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలేవీ మాంద్యం కోరల నుంచీ దేశాన్ని కాపాడలేకపోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న ఉద్దీపన నిర్ణయాలు కూడా కలిసిరావట్లేదనే వాదన వినిపిస్తోంది. మోడీ తొలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విపక్షాలు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా దేశ ఆర్థికవ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్‌ చేతకానితనం, అనాలోచితంగా జీఎస్టీ అమలు,నోట్ల రద్దు వంటి నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆటోమెబైల్‌ ఇండస్ట్రీ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రముఖ వాహన తయారీదారు సంస్థ మారుతీ సుజుకీ కూడా ఆర్థికమాంద్యం కారణంగా సేల్స్‌ పడిపోయి రెండు రోజులు గురుగ్రామ్‌, మానేసర్‌ లోని తమ ఫ్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 2025 నాటికి రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న మోడీ సర్కార్‌ ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని ఎంతవరకూ  గట్టెక్కిస్తుందో భవిష్యత్తులో తెలుస్తుంది.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close