మీజు 16ఎస్‌’ స్మార్ట్‌ఫోన్‌ అదిరింది..!

0

హైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ మీజు తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. దీని పేరు మీజు 16ఎస్‌. కంపెనీ నుంచి వస్తున్న ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇది. లేటెస్ట్‌ ఫీచర్లతో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కంపెనీ ఈ మీజు 16ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ అమర్చింది. అలాగే ఇందులో 6.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఆమ్‌లెడ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 9 పై ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇంకా ఫోన్‌లో 3,600 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్‌ సెన్సర్‌, డ్యూయెల్‌ 4జీ వీవోఎల్‌టీఈ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోన్‌ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో 48 ఎంపీం 20 ఎంపీ డ్యూయెల్‌ రియర్‌ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్‌ మూడు వేరియంట్‌ రూపంలో ఏప్రిల్‌ 28 నుంచి చైనా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఇండియన్‌ మర్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. 6 జీబీ ర్యామ్‌ ం 128 జీబీ మెమరీ ఒక వేరియంట్‌. దీని ధర రూ.35,000. 8 జీబీ ర్యామ్‌ం 128 జీబీ మెమరీ రెండో వేరియంట్‌. దీని ధర రూ.38,000. ఇక 8 జీబీ ర్యామ్‌ం256 జీబీ మెమరీ మూడో వేరియంట్‌. దీని ధర రూ.43,000గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here