Featuredరాజకీయ వార్తలు

అఫిడవిట్‌లో అబద్ధాలు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌) తెలంగాణరాష్ట్రంలో ఊహించని ఆర్థిక కోణాలు. డబ్బే లక్ష్యంగా పరిపాలన సాగిందా..? ఉద్యమపార్టి రాజకీయపార్టీగా మారగానే తెలంగాణ గాంధీకి ఏమైంది. ఆయనకు తెలియకుండా జరిగే వీలే లేదు. అలా అని ఆయన అంతస్థాయికి దిగజారతారా..? అనే అనుమానాలకు తెరదించుతూ… ఆధా రాలు కళ్ళముందు కదిలాడుతున్నాయి. సాక్షాత్తూ కేసీఆర్‌ ప్రమాణపత్రం లోనే ఆబద్దాలు ఉండటం.. షాకింగ్‌ విషయం. ఇక కాబోయే ముఖ్యమం త్రిగా తెరపై కనిపించే గులాబీ యువనేత కూడా తన ఎన్నికల అఫిడవిట్‌ లో ప్రస్థావించని సంఘటనలు సాక్ష్యాలుగా ఉన్నాయి. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌ అందిస్తున్న సంచలన పరిశోధన కథనం. సెక్యురిటీ భూమి..: సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామం. సర్వే నెంబర్‌ 1048లో 16 ఎకరాల 7 గుంటల భూమి షావలీఖాన్‌ పేరుతో ఉంది. ఈ భూమిలో 6 ఎకరాల 6 గుంటల భూమిని ఏప్రిల్‌4, 1969లో (డాక్యుమెంట్‌ నెంబర్‌ 263/1969) అమ్మారు. ఇంకి ఆ సర్వే నెంబర్‌ లో 10 ఎకరాల ఒక గుంట భూమి మిగిలింది. కాలక్రమేణ ఆయన వారసులలో మొదటి వారసుడు అజీన్‌ ఖాన్‌ ఐదెకరాల భూమిని మల్లారెడ్డికి ఆగష్టు12, 1985 (డాక్యుమెంట్‌ నెంబర్‌ 485/1985) అమ్మారు. మరో వారసుడు మహ్మద్‌ హు స్సేన్‌ ఖాన్‌ తన వారసులైన తేజ్‌ ఖాన్‌, శిరాజ్‌ ఖాన్‌, రియాజ్‌ ఖాన్‌, నజీర్‌ ఖాన్‌ లకు ఇంకా 4 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. ఈ భూమిని ‘మాయ’ దొంగలెత్తుకెళ్ళారు..: 1048 సర్వే నెంబర్‌ లోని 4 ఎకరాల భూమిలో రెవెన్యు రికార్డులలో ముందు 2 ఎకరాలు గల్లంతైంది. అ తరువాత మిగిలిన 2.36 గుంటల భూమి కూడా దొంగలెత్తుకెళ్ళినట్లు మాయమయింది.వీరెలా వచ్చారు..: 1048 సర్వే నెంబరు భూమిలోకి రికార్డుల పరంగా ఆశి రెడ్డి, నర్సింహారెడ్డి పేర్లు ఎక్కాయి. అంచెలంచెలుగా ఉన్నతాధికారులు అయిన జాన్‌ వెస్లీ, రెవెన్యూ ఉద్యోగులు, కల్వకుంట్ల శైలజ, ఎంపీ సంతోష్‌ పేర్లు వచ్చి చేరాయి. ఏకంగా ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వచ్చి చేరింది. అంటే హక్కు లేని యజమాని నుంచి కేసీఆర్‌ ఈ భూమి కొనుగోలు చేశారు. ఫిర్యాదు సమాధి: సర్వే నెంబర్‌ 1048లోని సర్వే నెంబరుకు సంబంధించి జులై 20, 2015న శిరాజ్‌ ఖాన్‌ స్వయంగా రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఫిర్యాదు సమాధి అయిన విషయం తెలియక ఇంకా అమాయకంగా రెవెన్యూ ఆఫీస్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేసిఆర్‌ తప్పు చేశారా..?: పిర్యాదు అందిన తరువాత అది వివాదాస్పద భూమి. అయితే కేసీఆర్‌ ఎక్కడా వివాదస్పద భూమి అని పేర్కోలేదు..అలాగే రెవెన్యూ రికార్డుల ప్రకారం కేసీఆర్‌ పేరుతో 2.0125 ఎకరాలు అని ఉంది. అయితే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో సీరియల్‌ నెంబర్‌ రెండులో 2 ఎకరాల 4 కుంటల భూమి అని స్పంష్టంగా పేర్కొన్నారు. కేసీఆర్‌ ఎన్నికల కవిూషన్‌ కు సమర్పించిన అఫిడవిట్‌ లో నిజాలు చెప్పారా.. లేదా ఆబద్దాలు చెప్పారా..? అనేది ముందు ఎన్నికల సంఘం.. ఆ తరువాత న్యాయస్థానం తేల్చాల్సిన విషయం. తనయుడి అఫిడవిట్‌ లోనూ…: తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు.. ఆయన వాగ్ధాటి అందర్నీ ఆకర్శిస్తుంది. ఫోటోజెనిక్‌ ఫేస్‌ కావడంతో అభిమానులు కూడి ఎక్కువే. భావి రాజకీయాలలో సుధీర్ఘ కాలం ఉండాలని భావించే రాజకీయ నాయకుడు. మరి ఈ కేటీఆర్‌ కూడా అఫిడవిట్‌ లో పొరపాట్లు చేయడం గమనార్హం. హిమాంషు… కథ: కేటీఆర్‌ తన అఫిడవిట్‌ లో కాలం నెంబర్‌ 3లో తనకు డి మాట్‌ అకౌంట్‌ ప్రస్థావించారు. అందులో 9 లక్షల 36 వేల 339 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ అంతర్జాలంలో కేటీఆర్‌ హిమాంశు మోటర్స్‌ లో డైరెక్టర్‌ గా ఉన్నట్లు చూపుతోంది. దీంతో కేటీఆర్‌ హిమాంశు లో డైరెక్టర్‌ గా ఉన్న విషయం దాచి పెట్టినట్లే. హెల్త్‌ లోగుట్టు ఏమిటో..: ఇటీవల ఆరోగ్యంపై అందరకీ శ్రద్ధ పెరిగింది. అలాగే మన కేటీఆర్‌ కు కూడా. అయితే కాల్‌ హెల్త్‌, సద్గురు హెల్త్‌ విషయాలపై భవిష్యత్తులో పెద్ద రాద్దాంతం జరిగే అవకాశం లేకపోలేదు. ఇందులో తేజురాజు (సత్యం కంప్యూటర్స్‌ రామలింగరాజు కుమారుడు) తో కలసి మలేషియా ప్రధానితో కలవడం జరిగింది. ఇందులో 1500 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఏది ఏమైనా మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న కేటీఆర్‌ ఈ విషయాలపై పెదవి విప్పాలి. లేదంటే అల్లిబిల్లి కంపెనీల అల్లికలు మరెన్నో వెలుగుజూసే అవకాశం ఉంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close