మిషన్‌ యూపీ

0

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి ¬దాలో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా లఖ్‌నవూలో రోడ్‌ షో చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం లఖ్‌నవూ చేరుకున్న ప్రియాంక.. సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తోడుగా ఈ రోడ్‌ షో ప్రారంభించారు. బస్సుపైన నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఈ రోడ్‌షోలో పార్టీ ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ విభాగం ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, ఇతర కాంగ్రెస్‌ నేతలు కూడా పాల్గొన్నారు. నగరంలోని అమౌసి ఎయిర్‌పోర్టు నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వరకు 25 కిలోవిూటర్ల మేర ఈ ప్రదర్శన సాగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె పరిధిలో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో భాజపా కంచుకోటలుగా చెప్పుకొనే స్థానాలున్నాయి. వాటిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎంపీగా పనిచేసిన గోరఖ్‌పూర్‌ సీట్లు కీలకమైనవి. వీటిపై ప్రియాంక ప్రత్యేక దృష్టిపెట్టనున్నారు. ఉత్తర ప్రదేశ్‌ పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత ప్రియాంక గాంధీ మొదటి సారి లక్నోలో పర్యటించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. లక్నో విమానాశ్రయం నుంచి అక్కడి కాంగ్రెస్‌ కార్యాలయం వరకూ ప్రియాంకా గాంధీ, రాహుల్‌ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో 500 మంది కార్యకర్తలతో ఉన్న ‘ప్రియాంక సేన’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సేనలో కాంగ్రెస్‌ సీనియర్‌ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వీరంతా ‘పింక్‌ డ్రెస్‌’ వేసుకున్నారు. మహిళలపై గౌరవానికి సూచనగానే తాము ఈ రంగు ఎంచుకున్నామని చెప్పారు. ప్రియాంక గాంధీ రోడ్‌ షో జరుగుతున్న దారిలో కాంగ్రెస్‌ అభిమానులు మేం ‘నీలో ఇందిరను చూస్తున్నాం’ అనే భారీ ¬ర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. ప్రియాంకతోపాటు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉన్నప్పటికీ నేతలు, కార్యకర్తలు అందరూ ప్రియాంక కళ్లలో పడడానికి ప్రయత్నించారు. దారి పొడవునా ఆమె పేరుతో నినాదాలు చేశారు. ‘నయీ ఉవిూద్‌, నయా దేశ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో ”పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్‌ ఇంఛార్జిలు రోడ్‌ షో పొడవునా వేలాది మంది మద్దతుదారులను కలిశారని ఆ పార్టీ తన అధికారిక ట్విటర్‌ హాండిల్లో పేర్కొంది. ఈ రోడ్‌ షోలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చేవరకూ తమకు సంతృప్తి లేదని అన్నారు. తమది పేదల, రైతుల ప్రభుత్వం అని చెప్పారు. ”దేశ చౌకీదార్‌, ఉత్తర ప్రదేశ్‌, ఇతర రాష్ట్రాలు, ఎయిర్‌ ఫోర్స్‌ డబ్బు దొంగిలించారని” రాహుల్‌ ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here