Featuredరాజకీయ వార్తలు

లక్షల్లో ఓట్ల గల్లంతు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన నాటి నుంచే పలు రాజకీయ పార్టీలు ఓట్ల గల్లంతుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల వరకు పదేపదే ఫిర్యాదులు చేశాయి. అయినా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చతికిలపడ్డారు. బోగస్‌ ఓట్లు, బినామీల వివరాలను కట్టలు కట్టలుగా తెచ్చి ఇచ్చినా పట్టించుకున్న నాథులు లేరు. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఓ ప్రహసనంలా సాగుతోంది. నిబంధనల ప్రకారం పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించాలి. ఆ చిరునామాలో ఓటరు లేరని గుర్తించిన పక్షంలో ముందస్తుగా ఆ ఇంటి యజమానికి నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసులను గ్రామ పంచాయతీ, పురపాలిక, తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ప్రదర్శించాలి. అత్యధిక శాతం సందర్భాల్లో ఆ తనిఖీ కాగితాలకే పరిమితమవుతోంది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో కూడా ఈ వ్యవహారం మొక్కుబడిగా సాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంటున్న వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండా తొలగించడం, తిరిగి నమోదు చేసుకున్నా చాలా మందికి ఓటు హక్కు కల్పించడంలో ఎన్నికల సంఘం చతికిలపడటం ఈ లోపాలను చెప్పకనే చెబుతోంది. దరఖాస్తు దారులకు చుక్కలు … ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో దాదాపు 32 లక్షల మంది ఓటు కోసం పేరు నమోదు చేసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. వారిలో అయిదున్నర లక్షల మంది మాత్రమే కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా..మిగిలిన వారు గతంలో ఓటు ఉండి తొలగింపునకు గురైన వారు, పేరు, చిరునామా మార్పులతో దరఖాస్తు చేసిన వారే. వీరిలో చాలా మందికి చివరి నిమిషం వరకు ఓటరు గుర్తింపు లభించలేదు. మరికొందరికి గుర్తింపు లభించినా ఆన్‌లైన్‌లో ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్‌ కాలేదు. ఫలితంగా వారంతా ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. సమస్యలెన్నో..పరిష్కరించే వారేరి? -పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి సీఈవో వెబ్‌సైట్‌ పనిచేయ లేదు. ఈ కారణంగా పోలింగ్‌ కేంద్రం, సీరియల్‌ నంబరు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. -ఓటరు జాబితా సవరణ జరిగిన తర్వాత తమ ఓట్లు ఉన్నాయా? తొలగించారా? అన్నది చాలామంది తెలుసుకోలేదు. -ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ అమలు తర్వాత దొంగ ఓట్లు తొలగిపోయాయని ఈసీ ఘంటాపథంగా చెప్పింది. అందుకు భిన్నంగా చాలామంది రెండు మూడు చోట్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -ఓటు హక్కు ఉన్న భార్యభర్తలు, కుటుంబ సభ్యులకు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలు కేటాయించారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన వాళ్లు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. ఈసీదే బాధ్యత: టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ కన్వీనర్‌ ఈ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు ఘటనలకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ కన్వీనర్‌ జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాతో జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఎలా జరుపుతారని శనివారం ఆయనొక ప్రకటనలో ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దయిన ఆర్నెల్ల లోపు ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ తొందరపడిందని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుండానే ఎన్నికలకు వెళ్లిందని విమర్శించారు. మెజార్టీతో టీఆర్‌ఎస్‌దే అధికారం హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించి.. రెండవ సారి అధికారం చేపట్టనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని ఎగ్జిట్‌ సర్వేలన్ని టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలమని వెల్లడించాయన్నారు. మంత్రి హరీష్‌రావు ఫోన్‌లో స్థానిక నాయకులతో మాట్లాడుతూ సిద్దిపేట నియోజక వర్గంలో పెద్దఎత్తున ఓట్లు వేసి చైతన్యాన్ని చాటిన నియోజక వర్గ ప్రజలకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు క తజ్ఞతలు తెలిపారు. గతంలో ఎన్నడు లేని విధంగా సిద్దిపేటలో 79శాతం పోలింగ్‌ జరగటం అభినందనీయమన్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలు తమ స్పూర్తిని చాటారని కొనియాడారు. 2014 ఎన్నికల కంటే అధికంగా 5శాతం పోలింగ్‌ పెరిగిందన్నారు. గ్రామాల్లో 85 శాతం నుండి 90శాతంకు పైగా ఓటింగ్‌ జరగటం గర్వంగా ఉందన్నారు. ప్రజల సామాజిక చైతన్యానికి, అభివ ద్ధి, ఆకాంక్షకు, సంక్షేమ బాటలకు ఈ పరిణామాలు సూచిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, రైతులు,వ ద్ధులు, యువకులు, మహిళల పాత్ర చాల కీలకమని అభివర్ణించారు. విదేశాల్లో ఉండేవారు, దేశంతలో ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, హైదరాబాద్‌ నగరంలో ఉన్నవారు సైతం స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటం గర్వకారణమన్నారు. ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య యుతంగా అధికారులు, పోలీసులు, పోలిసు సిబ్బంది ఎన్నికలు నిర్వహించారని ప్రశంసించారు.పార్టీ నాయకులు, కార్యకర్తల క షి భేష్‌గత మూడు నెలల నుండి సిద్దిపేట నియోజక వర్గంలో అవిశ్రాంతంగా క షిచేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు క షిచేశారని మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. ప్రతి కార్యకర్తకు మనస్ఫూర్తిగా క తజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తనకు భారీ మెజార్టీ అందించేందుకు అహార్నిశలు క షిచేశారన్నారు. అందరి క షితోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానని స్పష్టం చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close