పుదీనా ప్రయోజనాలు

0

పుదీనా లేదా ‘ మింట్‌ ‘ అని పిలువబడే ఈ ఆకు రకం మండే వేసవిలో సైతం శరీరానికి స్వాంతన చేకూర్చడంలో తనవంతు ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని పుదీనా చట్నీ, పుదీనా లెమనాయిడ్‌, పుదీనా ఐస్‌ క్రీమ్‌, రైతా, మొదలైన రూపాలలో వినియోగించడం ద్వారా, దీని అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. కొందరికైతే పుదీనా అంటే మక్కువ ఎక్కువ. క్రమంగా లెమనాయిడ్‌, టీ రూపాలలోనే కాకుండా పుదీనా రైస్‌, సలాడ్లు వంటి వాటిలో కూడా తరచుగా జోడించుకుంటూ ఉంటారు. ఇది శరీరానికి ఊరటనివ్వడమే కాకుండా, ఆరోగ్యప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. క్రమంగా ఇది కఫాన్ని దూరంగా ఉంచడంలో కూడా ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పుదీనా శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుది. పుదీనా, స్పియర్మింట్‌ రెండూ కూడా వ క్ష జాతుల సమూహానికి చెందినవిగా మరియు మెంథోల్‌ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే స్పియర్మింట్లో, పుదీనాతో పోల్చినప్పుడు స్వీట్‌ ఫ్లేవర్‌ కొంచం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లిమోనేన్‌, సినియోల్‌, మరియు డైహైడ్రోకార్వోన్లలో కూడా సమ ద్ధిగా ఉంటుంది. అదేవిధంగా పుదీనాలో కూడా మెంథోన్‌ మరియు లిమోనేన్‌ గుణాలు అధికంగా ఉంటాయి. పుదీనా మరియు స్పియర్మింట్‌ విటమిన్‌ ఎ, పొటాషియం, కాల్షియం, విటమిన్‌ సి, మెగ్నీషియం, ఇనుము, ప్రోటీన్‌ మరియు విటమిన్‌ 6 లకు మంచి మూలంగా ఉంటుంది. పుదీనా యాంటీ ఆక్సిడెంట్లలో సమ ద్దిగా ఉంటుంది. మరియు దీని మూలంగా చర్మానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. దీనిని కాప్సూల్‌ రూపంలో కూడా తీసుకోవడం జరుగుతుంది. కఫం మరియు, శ్వాస కోశ సంబంధిత పరిస్థితులు ఎదురైన పక్షంలో ఆవిరి పట్టడం ద్వారా కూడా ఉపశమనం చేకూరుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here