Featuredస్టేట్ న్యూస్

పల్లాకు పదవి!

  • రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా రాజేశ్వరరెడ్డి
  • నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
  • సీఎం కేసీఆర్‌తో పల్లా భేటీ
  • బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు

హైదరాబాద్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి కీలక పదవి వరించనుంది. కేబినెట్‌ ¬దా కలిగిన రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని పల్లాకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ఈ మేరకు నియామక పక్రియను చేపట్టాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ¬రా¬రీగా సాగిన హుజూర్‌నగర్‌ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించాడు. ఈ విజయంలో పల్లా రాజేశ్వరరెడ్డి కీలక భూమిక పోషించారు. మొదటి నుంచి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణం పల్లా రాజేశ్వరరెడ్డి పనులు చక్కబెడుతూ వస్తున్నారు. దీంతో కేసీఆర్‌కు విదేయుడిగా పేరుపొందాడు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పల్లాకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికితోడు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం పల్లా చేసిన కృషిని మంత్రులతో పాటు కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ అభివృద్ధికోసం పల్లా కృషిని గుర్తించిన కేసీఆర్‌ ఆయనకు తాజాగా ఈ పదవి కట్టబెట్టారు. పల్లా నియామకంతో పాటుగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం వెల్లడించారని ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటనలో తెలిపింది. వచ్చే జూన్‌ లోపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని సిఎం భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై మూడు నాలుగు రోజులలోనే వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని సిఎం నిర్ణయించినట్లు తెలుస్తుంది.

సిఎం కెసిఆర్‌తో పల్లా భేటీ

తెలంగాణ రాష్ట్రసమితి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిశారు. ఈసందర్భంగా తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా తనను నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అన్ని వేళలా అండదండగా ఉండేవిధంగా రైతు సమన్వయ సమితులను సమర్ధవంతంగా నిర్వహించాలని సీఎం పల్లారాజేశ్వరరెడ్డిని కోరారు. వచ్చే జూన్‌ మాసంలోపు గ్రామస్తాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చే సేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్దతుల్లో తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు అనుబంధ అంశాలపై కూడా సమన్వయ సమితులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. ఈనేపధ్యంలో కొత్తగా నియమితులైన పల్లారాజేశ్వరరెడ్డి రైతు సమన్మయ సమితిని పటిష్టంచేసేందుకు కృషి చేయాలని సీఎం అన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close