Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

మిడ్‌మానేరు నిర్వాసితుల గోస పట్టదా..?

కేసీఆర్‌ సీఎం అయితే కష్టాలు పెంచారు

  • ప్రశ్నించిన వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్ర
  • తక్షణం బాధితులకు పరిహారం చెల్లించాలి
  • కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌, పొన్నం డిమాండ్‌

రాజన్న సిరిసిల్ల (ఆదాబ్‌ హైదరాబాద్‌):

తెలంగాణ ఉద్యమ సమయంలో మిడ్‌ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల తరుపున కెసిఆర్‌ ఇక్కడికి వచ్చి నష్ట పరిహారం ఇచ్చే దాకా ఇక్కడే ఉంటాం అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముంపు గ్రామాల సమస్యలను గాలికి వదిలేశాడని కరీంనగర్‌ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్‌ కుమార్‌, మల్కాజిగిరి ఎంపి రేవంత్‌ రెడ్డి, చాడ వెంకటరెడ్డి లు విమర్శించారు. పరీహారం అందక మిడ్‌ మానేరు నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అండగా నిలిచిన ప్రజలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మిడ్‌మానేరు నిర్వాసితుల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని భావించి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శిం చారు. ఊర్లను మానేర్‌లో ముంచి కేసీఆర్‌ మూటలు దోచుకుం టున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహి అంటున్నారని మండిపడ్డారు. ‘మిడ్‌మానేరు నిర్వాసితులు ఇల్లు కట్టుకునేందుకు రూ. ఐదు లక్షల నాలుగు వేలు, 18 ఏళ్లు నిండిన వారికి రూ.2లక్షలు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హావిూ ఇప్పటి వరకూ నెరవేర్చలేదు కానీ కానీ ఆయన సొంత గ్రామం చింతమడకకు మాత్రం ప్రతి ఇంటికి రూ.10 లక్షలు ఇస్తా నంటున్నారు. చింతమడకకు ఏమైందని లక్షలకు లక్షలు ఇస్తు న్నారు? నష్ట పరిహారం చెల్లిం చేందుకు నీ బంధువలు తప్ప ముంపు గ్రామాల ప్రజలు కనిపిం చాడంలేదా? టీఆర్‌ఎస్‌ పార్టీ దొంగల బండిగా మారింది. చివరికి చెప్పులు కూడా విడిచిపెట్టడం లేదు’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 13గ్రామాల ప్రజలు మౌనంగా ఉంటే హక్కులు తీరవన్నారు. వచ్చే బ్జడెట్‌ సమావేశ సమయంలో హైదరాబాద్‌లో 48 గంటల దీక్ష చెపట్టమని నిర్వాసితులకు సూచించారు. దీక్షలో తాను కూడా పాల్గొంటానని, అప్పుడు ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దామని రేవంత్‌ వ్యాఖ్యానించారు. మంచిగా నష్ట పరిహారం చెల్లిస్తే సరి లేదంటే దంచి తీసుకుంటామని ప్రభు త్వాన్ని హెచ్చ రించారు.ఈటల రాజేందర్‌ మాటలతో భూకంపం పుట్టిందనుకున్నాం. రాత్రి కేటీఆర్‌ ఫోన్‌ చేయగానే ఈటల తుస్సుమనిపించారు. ఇదేనా కరీంనగర్‌ పౌరుషమంటే అని రేవ ంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌ అమెరికాలో బాత్‌రూమ్‌లు కడుగుతూ బతికిండని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హావిూలన్ని నెరవేర్చాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌, ఇళ్ల నిర్మా ణానికి రూ.5లక్షల 4వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన హావిూలన్నీ నెరవేర్చాలని లేనట్లయితే కేసీఆర్‌ వస్తున్న రోజు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతామన్నారు. ఎంపీ సంతోష్‌కు పుట్టిన గడ్డపై మమకారం ఉంటే మిడ్‌మానేరు ముంపుకు గురైన 13 గ్రామాలను దత్తత తీసుకోవాలని సవాల్‌ విసిరారు. ప్రజలు కొంతకాలంగా ఆందోళనచేస్తున్నా పట్టించు కోని సిఎం ప్రజలకు మేలు చేస్తాడని నమ్మగలమా అని అన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close