మెర్సిడెజ్‌ బెంజ్‌ జీ63 కారు ఖరీదు రూ.2.19కోట్లు

0

(న్యూదిల్లీ, ఆదాబ్ హైదరాబాద్): జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ శుక్రవారం మరో సరికొత్త కారును భారత విపణిలోకి విడుదల చేసింది. మెర్సిడెజ్‌ వాహన శ్రేణిలోని ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో ఏఎంజీ జీ63పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ సరికొత్త కారు ధర రూ.2.19కోట్లుగా నిర్ణయించారు.
జీ63 నాలుగు లీటర్ల వీ8 బిట్‌టర్బో ఇంజిన్‌, 585హార్స్‌పవర్‌ కలిగి ఉంది. కేవలం 4.5 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ కారు అత్యధికంగా గంటకు 220 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
‘బండరాళ్లను సైతం సులభంగా దాటగల స్పోర్ట్స్‌ కారు ప్రదర్శనను జీ63 ఇస్తుంది. దీంతో పాటు, స్టైలిష్‌, హైటెక్‌ కేబిన్‌లను ఇందులో పొందు పరిచాం. సంస్థ నుంచి వస్తున్న మరో అద్భుతమైన వాహనం మెర్సిడెజ్‌ ఏఎంజీ జీ63’’ అని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా ఉపాధ్యక్షుడు (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) మైకేల్‌ జాప్‌ తెలిపారు.
శుక్రవారం విపణిలోకి విడుదల చేసిన ఏఎంజీ జీ63 2018లో మెర్సిడెజ్‌ నుంచి వచ్చి పదో ఉత్పత్తి కావడం గమనార్హం. ఈ పండగ సీజన్‌ కోసం తమకు మరింత కలిసొస్తుందని జాప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాగే తమ కంపెనీ నుంచి మరిన్ని ఉత్పత్తులు, ఆవిష్కరణలు వస్తాయని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here