Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

మనిషిని పోలిన మనుషులు

20కోట్లు వసూలు

? బుట్టలో పడ్డ 5,314,715ల మంది

? అసలు కారణం…

(హిస్టరీలో మిస్టరీ కథనం-7)

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

రాముడు?భీముడు, అపూర్వ స¬దరులు, హలోబ్రదర్‌, జీన్స్‌, అదుర్స్‌ వంటి తెలుగు సినిమాలలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండే సన్నివేశాలు చూసాం. అయితే ఆ సినిమాలో ముందు ట్విన్స్గా కనిపించే హీరోలిద్దరినీ వేర్వేరుగా పరిచయం చేసినా, సినిమా క్లైమాక్స్కొచ్చేసరికి వారికి రక్తసంబంధం కలిసిపో తుంది. సినిమాలు కాబట్టి పాత్రలను మన ఇష్టం వచ్చినట్లు క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆ పాత్రల సంబంధాలను ఎక్కడో చోట ముడిపెట్టవచ్చు. కాని, నిజ జీవితంలో కూడా మనిషిని పోలిన మనిషి తారస పడితే? వారి మధ్య ఎలాంటి రక్తసంబంధాలు లేకపోతే ఆశ్చర్యం వేయక మానదు. అలా భూవ్మిూద మనిషిని పోలిన మనుషులు ఏడుమంది దాకా ఉంటారంటారు. ఒకే రూపంలో ఏడుమందిని చూడడం అసాధ్యం. కాని మనిషిని పోలిన మనిషిని అప్పుడప్పుడు చూస్తుంటాం. డొనాల్డ్‌ ట్రంప్‌, పుతిన్‌, నరేంద్ర మోడీ, రాందేవ్‌ బాబా, జూనియర్‌ ఎన్టీఆర్‌, అనుష్క శర్మ, సల్మాన్‌ ఖాన్‌, షోయబ్‌ అక్తర్‌ వంటి ప్రముఖలను పోలిన వ్యక్తులు ఉన్నారు.

శాస్త్రీయంగా…:

మనిషిని పోలిన మనుషులు ఉంటారు అనే మాట మాత్రం కచ్చితంగా నిజం. కానీ వందశాతం పోలికలు కలిగి ఉంటారా.. ? అంటే ఆ,యా వ్యక్తులపై లోతైన పరిశోధన జరగలేదు.

కార్నెల్‌ యూనివర్సిటీ లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నటువంటి షీహాన్‌ తన రీసెర్చ్‌ ద్వారా చెప్పింది ఏంటంటే మనుషులు చాలా రకాలుగా ఉంటారు. వారి పోలికలు వారి ప్రవర్తన, ప్రతి మనిషికి ఇంకో మనిషితో అంత సంబంధం ఉండదు. కేవలం మానవజాతిలోనే ఇన్ని రకాలు కనిపిస్తాయి. కానీ కొన్ని కొన్ని సార్లు ఒకే పోలికలు కలిగిన వ్యక్తులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనందరం ఎక్కడి నుంచి వచ్చాము. మనకి మూలం ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది కదా. ఒక మానవుడు నుండి ఈ సృష్టి ప్రారంభం అయింది. అంటే ఒకే ఒక్క జీన్స్‌ ఈ సృష్టి అంతా విస్తరించి ఉంది. ఏ విధంగా అంటే ఆ ‘జీన్స్‌ మ్యుటేషన్‌’ అనే పద్ధతి ద్వారా కొన్ని మార్పులకు లోనయ్యి రకరకాల జీన్స్‌ లను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎప్పుడు ఈ మ్యుటేషన్‌ కి లోన్‌ అవుతుందంటె ‘క్రాస్‌ ఎగ్‌ ఫెర్టిలైజేషన్‌’ జరిగినప్పుడు. ఈ విధంగా ఒకే ఒక జీన్స్‌ అనేది రకరకాల పోలికలు కలిగి ఉండే విధంగా ప్రపంచమంతా విస్తరించి పోయింది. కానీ కొన్ని తరాల తరువాత ఇది మళ్ళీ అదే పోలికను కనపరిచేటటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే విూకు సులువుగా అర్థం కావాలంటే ‘రూబిక్స్‌ క్యూబ్‌’ తీసుకోండి. దానిని సెట్‌ చేయాలంటే విూరు ప్రతిసారీ ఒకటే పద్ధతిని ఉపయోగిస్తారా..? లేకపోతే రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. ఎన్ని కాంబినేషన్స్‌ కనిపిస్థాయి విూకు దానిలో కానీ ఫైనల్‌ గా అన్ని ఒకేలా వస్తాయి. అలాంటిదే మన జీన్స్‌.

ఎన్ని రకాల కాంబినేషన్స్‌ కి అది లోనయినప్పటికీ ఏదో ఒక సమయానికి అది మళ్ళీ యధాతధంగా వస్తుంది కచ్చితంగా. కానీ అది వందశాతం మొదటి దానిని కలిగి ఉండదు. ఎందుకంటే వాతావరణ మార్పులకు కూడా మన శరీరం లోనవుతుంది కాబట్టి. మన శరీరాన్ని రెండు రకాలైన అటువంటివి ప్రభావితం చేస్తాయి. అవేమిటంటే ‘జెనోటైప్‌’ అంటే పూర్వికుల నుండి వచ్చేవి, ‘ఫెనోటైప్‌’ అంటే పర్యావరణం ద్వారా వచ్చే మార్పులు. అంటే సూర్యుడి కిరణాల వల్ల కూడా మన డిఎన్‌ఏలో మార్పులు ఉంటాయి. ఈ ‘జెనో టైప్‌’ ఎవరిలో అయితే ఒకేలా ఉంటుందో వారు ఒకే పోలికలు కలిగి ఉంటారు. కానీ ‘ఫెనోటైప్‌’ ప్రభావం వల్ల కొంత వ్యత్యాసాన్ని పొందుతారు. లా ఆఫ్‌ మెండల్‌ ప్రకారం పోలికలు అనేవి ఒక జనరేషన్‌ లో కనపడకపోయినా అప్పటికీ ఆ తరువాతి జనరేషన్‌ లో కనిపించే చాన్స్‌ ఉంది.

వందశాతం కాదు..:

మనిషిని పోలిన మనుషులు ఉంటారు. కానీ ఖచ్చితంగా వంద శాతం పోలికను కలిగి అయితే ఉండరు. అలా అని 7గురు ఉంటారా..? ఇద్దరు ఉంటారా..? ముగ్గురు ఉంటారా..? అనేది ఎవరూ చెప్పలేరు. అలా ఎంత మంది అయినా ఉండవచ్చు. ఆ కాంబినేషన్‌ ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు అదే పోలిక కలిగిన మరొక వ్యక్తి జన్మించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా విూకు లాగ ఎవరైనా విూకు కనిపిస్తే అప్పుడు విూరు సంతోషించవచ్చు ఎందుకంటే వారు ఖచ్చితంగా విూ పూర్వీకుల నుండే వచ్చారు అన్న విషయం విూరు గుర్తు తెచ్చుకోండి.

సల్మాన్‌ కరాచీ వెళ్ళాడా..?:

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ను అచ్చుగుద్దినట్లు పోలిన ఒక వ్యక్తి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్‌ చల్‌ చేస్తోంది. పాకిస్తాన్లోని కరాచీలో కనిపించిన ఆ వ్యక్తికి సల్మాన్‌ ఖాన్‌ పోలికలు ఉండడమే కాదు కండలు తిరిగిన శరీరం, అదే ఒడ్డూపొడుగు, క్రాఫింగ్‌ కూడా ఉండడం విశేషం.

వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్‌ అయ్యారు..:

గత కొన్ని రోజులుగా సోషల్‌ విూడియాలో అనుష్క శర్మ, అమెరికన్‌ సింగర్‌ జూలియా మైకేల్స్‌ ఫోటోలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దాంతో నెటిజన్లు వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి ‘అనుష్క శర్మ నీకు చెల్లి ఉందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫొటోను అనుష్క, జూలియాలు కూడా చూశారు.

ఃనీలీ:

120 కోట్లు వసూళ్ళు:

‘మనిషిని పోలిన మనుషులు 7గురు ఉంటారు’ అని మనకు తెలుసు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో విూకు తెలుసు కోవాలని ఉందా..? అసలు నిజ జీవితంలో చూస్తామా..? లేదా..? కూడా తెలీదు. ఒకడు బాగా డబ్బులున్న వాడు అయిఉంటాడు. మరొకరు కటిక పేదరికంలో ఉంది ఉంటాడు. ఒకడు లావుగా మరి ఒకడు సన్నగా ఉంటారు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఒక విద్యార్థికి వచ్చింది. ‘మనిషి తలుచుకుంటే ఏమైనా సాధ్యమే’ అని నిరూపించింది. తనలాగా ఎవరు ఉన్నారు.? ఎక్కడ ఉన్నారు.? తెలుసుకోవాలని ఉంది. అందుకే తాను ఒక వెబ్సైటు తయారు చేసింది. ఆ ఆలోచనే ఇప్పుడు తనని ప్రపంచంలో ప్రసిద్ధి ఆయ్యేలా చేసింది ఆ వెబ్సైట్‌ పేరే షషష.్‌షఱఅర్‌తీaఅస్త్రవతీర.అవ్‌ ముందుగా ఏ వెబ్సైటులో రిజిస్టర్‌ అవి విూ ముఖకవళికలు ఎలాగా ఉన్నాయో అక్కడ చెప్పాలి. అప్పుడు అది మన ముఖకవళికలు సరిపోయే వారిని మనకు చూపిస్తుంది . ఇలాగ మనలాంటి వారిని చూపించినందుకు ఆ సైట్‌ వారు 3.95 డాలర్లు వసూలు చేస్తారు. ఇప్పటివరకు ఈ వెబ్సైటులో 5 లక్షల మంది తమ లాంటి వారిని కలుసు కున్నారు. 120 కోట్లు సంపాదించింది. మరి విూరు కూడా ఒక సారి జాయిన్‌ అయిపోతే పోలా…. విూలాంటి వారు ఏ దేశంలో.. ఎక్కడ..? ఏవిధంగా ఉన్నారో చూసుకోవచ్చు. ఆల్‌ ద బెస్ట్‌.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close