Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

మధ్యవర్తిత్వం చేస్తే మంచిదే

  • కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
  • సమ్మె గురించి టీఎన్జీవో, టీజీవో నేతలకు చెప్పాం
  • సమ్మెపై గవర్నర్‌కు మెమోరాండం ఇచ్చాం
  • కార్మికులపై పోలీసులు చేస్తున్న దాడిని గవర్నర్‌కు వివరించాం
  • ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్ధం కావడం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె పై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తో ఆర్టీసీ జేఏసీ నాయకులు సోమవారం భేటీ అయ్యారు.
భేటీ అనంతరం అశ్వత్థామ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మెపై గవర్నర్‌ కు మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమం,పోలీస్‌ కార్మికులపై దాడి చేసిన వీడియోలను అందజేసినట్లు సూచించారు.
హక్కుల కోసం 10 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు చేస్తున్న దాడిని గవర్నర్‌ కు వివరించినట్లు చెప్పారు.కార్మికుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు.
నిజామాబాద్‌ సభలో కేసీఆర్‌ ఆర్టీసీ ని విలీనం చేస్తామని హావిూ ఇచ్చారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు,శ్రీనివాస్‌ యాదవ్‌, పూవ్వాడ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు
అంటే తమకు గౌరవం ఉందని అన్నారు. ఉద్యమం సమయంలో కేకే ఎంతో కృషి చేశారని కొనియాడారు.ఆయన మధ్యవర్తిత్వం చేస్తే మంచిదేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా… ఆర్టీసీ కార్మికులను గుర్తిస్తామన్న హావిూకి సీఎం కేసీఆర్‌ కట్టుబడాలన్నారు. కేకే చర్చలకు ఆహ్వానిస్తే తాము రావడానికి సిద్ధమన్నారు.కొందరు మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఎక్కడా రెచ్చగొట్టేవ్యాఖ్యలు చేయలేదన్నారు. టీఎన్జీవో, ఎన్జీవో నేతలు ముఖ్యమంత్రి తో భేటీ అవ్వడం తప్పులేదన్నారు. కానీ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ఆర్టీసీ జేఏసీకి మద్దతు ఇవ్వకుండా సీఎంతో సమావేశం అవ్వడం బాధాకర
విషయమన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి చనిపోవడం వల్ల తాము టీఎన్‌జీవో, టీజీవో నేతలను కలవలేకపోయామని, త్వరలో వారితో చర్చలు జరుపుతామని అన్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. టీఎన్జీవో నేతలకు ఆర్టీసీ సమ్మె గురించి చెప్పలేదనడం సరికాదన్నారు. ఉద్యోగ సంఘాల నేతలపై తమకు నమ్మకం ఉందని అశ్వత్థామరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close