Featuredస్టేట్ న్యూస్

మేడారం జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి

మంత్రి సత్యవతి రాథోడ్‌

ములుగు (ఆదాబ్‌హైదరాబాద్‌): భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సోమవారం జాతర పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, అధికారులతో సమావేశమై, పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. మంత్రి గట్టమ్మ దేవాలయం వద్ద ఆగి పూజలు నిర్వ హించిన అనంతరం అక్కడ స్టాళ్ల ఏర్పాటు, నీటి వసతి, మరుగుదొడ్లు నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మేడారం చేరుకొని, జంపన్నవాగు లెవలింగ్‌ పనులు, క్షవరశాల దగ్గర ఏర్పాట్లు, వివిఐపీ, విఐపి పార్కింగ్‌ పనులు పర్యవేక్షించారు. పారిశుద్ధ్య సిబ్బందితో పనులు సమర్థవంతంగా చేపట్టి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. పనుల పర్యవేక్షణ అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతరకి భక్తులు అధికంగా వస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పకడ్బందీగా చేయాలన్నారు. జంపన్న వాగు ఇసుక లెవెల మైంటైన్‌ చేయడానికి చేస్తున్న పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇకపై ప్రతి 3,4 రోజులకు ఒకసారి క్షేత్ర తనిఖీలు చేస్తామన్నారు. పండగ తెల్లారి నుంచి అధికారులు మేడారం లొనే ఉండి, పనుల పర్యవేక్షణ చేయాలన్నారు. భక్తు లకు సరిపోయే విధంగా మరుగుదొడ్లు ఉండాలనే దానిపైనే ప్రత్యేక శ్రద్ద పెట్టి పెడుతున్నామన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పనుల పురోగతి పరిశీలిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంకా మాన్‌ పవర్‌ పెంచుకొని పనుల్లో వేగం పెంచాలని అన్నారు. పనులు పూర్తి అయిన తరువాత నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవని అన్నారు. ఇప్పటికే పనుల పూర్తికి గడువు పెంచుతూ వచ్చారని, ఇక అవకాశం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు గడువులోపు చేయాలన్నారు. పనుల తీరును పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని, ఇబ్బం దులుంటే, వెంటనే ద ష్టికి తేవాలన్నారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన తేదిల్లోపు పనులు పూర్తి చేయాలని మంత్రి అన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యలో భక్తులందరికీ బంగారం ఇచ్చే కొత్త సంప్రదాయం ఈ ఏడాది నుంచి ప్రారంభించాలన్నారు. గుడిలో పందిళ్ళు కొత్తవి వేయాలని, ప్రతి రోజు తోరణాలు కొత్తవి కట్టాలని మంత్రి అన్నారు. జంపన్న వాగులో కొన్ని పొరపాట్లు గతంలో జరిగాయని, ఇక నుండి జరగకుండా చూడాలన్నారు. సమయం లేదని నాణ్యత లోపాలు ఉండొద్దని, థర్డ్‌ పార్టీ నుంచి క్వాలిటీ చెకింగ్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ ఫ్రీ అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపాలన్నారు. మరుగుదొడ్లు వెంటనే అందుబాటులోకి తేవాలని, మరుగదొడ్ల నిర్వహణ వారం రోజులకే కాకుండా,15 రోజులకు పెంచాలన్నారు. జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ మాట్లాడుతూ క్వాలిటీ కంట్రోల్‌ రిపోర్ట్‌ తీసుకున్న మీదటనే బిల్లులు చెల్లింపు చేయాలన్నారు. ఈ నెల 25కల్లా పనులు పూర్తి చేసినట్లు నివేదిక ఇవ్వాలన్నారు. జాతర నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ మాట్లాడుతూ, లోపాలు సరిదిద్దుకోవాలన్నారు. జాతరకు 15 రోజుల సమయమే ఉందని భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. వసతుల కల్పనలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. జాతర దష్ట్యా గ్రామాల్లో రోడ్లు వేయాలని అన్నారు. భక్తులు అధికంగా వస్తున్నందున ఇప్పటి నుంచే ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. సమీక్షలో ఐటిడిఎ పీవో చక్రధర్‌ రావు మాట్లాడుతూ 250 శాశ్వత మరుగుదొడ్లు వెంటనే ఉపయోగంలోకి తేవాలన్నారు.అన్ని శాఖల పనులు ఈ నెల 25 లోగా పూర్తి కావాలన్నారు.ప్లాస్టిక్‌ ఫ్రీ జాతరకు 10 చెక్‌ పోస్ట్‌ లు ఏర్పాటుచేస్తున్నామన్నారు.బస్సులో ఎక్కే ముందే ప్లాస్టిక్‌ నియంత్రణపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏఎస్పీ పి. సాయి చైతన్య, డిఎఫ్‌ఓ నిఖిత, జిల్లా రెవిన్యూ అధికారిణి కె. రమాదేవి, జెడ్పీ సిఇఓ ఏ.పారిజాతం, ఆర్డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ రాంచంద్రు, డిపివో వెంకయ్య, ఇడి ఎస్సి కార్పొరేషన్‌ తుల రవి, డిడబ్లుఓ మల్లీశ్వరి, డీఎస్సిడబ్లుఓ భాగ్యలక్ష్మి, ఈఈ పీఆర్‌ రాంబాబు, ఆర్డబ్ల్యూఎస్‌ మాణిక్యరావు, ఆర్‌ అండ్‌ బి వెంకటేష్‌, ఇవో రాజేంద్రం, మేడారం ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ రామూర్తి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ నాగజ్యోతి, తాడ్వాయి ఎంపిపి వాణిశ్రీ, మేడారం సర్పంచ్‌ బాబు రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close