ఎండీహెచ్ మసాలా అధిపతి గులాటీ ఇకలేరు.

0

(న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్):ఎండీహెచ్ మసాలా బ్రాండ్ గురించి తెలియని వినియోగదారులు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన మసాలా బ్రాండ్‌లలో ఒకటైన ఎండీహెచ్‌ పేరు చెప్పగానే ఆ సంస్థ యజమాని మహాశయ్ ధరమ్ పాల్ గులాటీ గుర్తొస్తారు. 99 ఏళ్ల గులాటీ ఆదివారంనాడు ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసారు. కంపెనీ వ్యవస్థాపకుడు మహాశయ్ చున్నీలాల్ గులాటీ కుమారుడైన ధరమ్ పాల్ గులాటి దేశ విభజన సమయంలో ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు.

ధరమ్ పాల్ గులాటీ ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఓ ప్లాట్ తీసుకుని 1959లో ఎండీహెచ్ మసాలా ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని విస్తరించారు. భారతదేశ సంపన్నుల జాబితాలోనూ చోటు సంపాదించుకున్నారు. 2016 లెక్కల ప్రకారం ఆయన ఆదాయం 924 కోట్లుగా ఉంది. ధరమ్‌ పాల్ గులాటీ పాకిస్థాన్‌లో సియాల్‌కోట్‌లో పుట్టి, పెరిగారు. దుకాణం నిర్వహణలో తన తండ్రికి చోదోడువాదోడుగా ఉండేందుకు ఐదో తరగతిలోనే చదువు ఆపేశారు. దేశ విభజన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి గులాటీ ఢిల్లీ వచ్చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here