బిజినెస్

మారుతి సుజుకి ఈకో ఇప్పుడు బీఎస్‌ 6 వేరియంట్‌లో విడుదల

-లాంచ్‌ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అమ్ముడైన వాహనాలు 6.5 లక్షలు

-ఇప్పుడు మెరుగైన మైలేజ్‌, శక్తివంతమైన పనితీరు, నిర్వహణ తక్కువ ఖర్చుతో ఈకోవ్యాన్‌ సిద్‌

విజయవాడ-బిఎస్‌ 6 మార్పుని ఆహ్వానిస్తూ.. అందరికంటే ముందుగా తన ప్రయత్నాలు ప్రారంభించిన మారుతి సుజుకి…. ఇప్పుడు తమ బిఎస్‌ 6 వేరియంట్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన ఈకోని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు… ఇప్పటివరకు మారుతి సుజుకి విడుదల చేసిన బీఎస్‌6 వాహనాల్లో ఈకో 9వ వాహనం.2019లోఈకోసేల్స్మొదటిసారిగా 1 లక్షలయూనిట్లనుదాటింది. ఇది 2018 అమ్మకాలతో పోలిస్తే… 36% వద్ధిని సాధించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. అద్భుతమైన మైలేజ్‌, సెగ్మెంట్‌ కంఫర్ట్‌, స్పేస్‌, పవర్‌, మెయింటైనెన్స్‌ కాస్ట్‌.. ఇలా ఎలా చూసినా ఈకో వినియోగ దారులకు అద్భుతమైన ఛాయిస్‌.మారుతిసుజుకిఈకో వ్యాన్‌ని జనవరి 2010లో ప్రారంభించారు. ఇప్పటివరకు 6.5 లక్షలయూనిట్‌అమ్మకాలమార్కునుదాటింది. బ్రాండ్‌ఈకో అద్భుతమైన డిజైన్‌,శక్తివంతమైనపనితీరుతో మార్కెట్‌లో వ్యాన్‌ విభాగంలో 87% మార్కెట్వాటాతో తిరుగులేని నాయకత్వాన్ని పొందింది. వినియోగదారుల ఇంటి మరియు వ్యాపార అవసరాలు తీరుస్తున్న ఈకో వ్యాన్‌.. అన్ని విధాల ఉపయోగపడుతుంది. ఒక కుటుంబం కుటుంబ చాలా సౌకర్య వంతంగా ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్డైరెక్టర్‌ (మార్కెటింగ్‌-సేల్స్‌) శశాంక్శ్రీ వాస్తవ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూవినియోగదారులకు నమ్మకమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు మారుతి సుజుకిఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈకో వ్యాన్‌ని బిఎస్‌ 6 వేరియంట్‌గా పరిచయం చేయడం ద్వారా వాతా వరణంపట్లమానిబద్ధతనుఇది తెలియ చేస్తుంది.ఈకో వ్యాన్‌ లాంచ్‌ అయిన దశాబ్దంనుండి84% మంది కొనుగోల ుదారులను ఆకర్షిస్తూనే ఉంది. ఈకో స్టైలిష్‌గా ఉండడంతో పాటువిశాలమైన డిజైన్‌, నిర్వహణఖర్చు కూడా చాలా తక్కువ. 50% పైగావినియోగదారులు వ్యాపారవినియోగంమరియు కుటుంబ రవాణా వాహనం కోసం వాహనాన్ని ఎంచుకుం టున్నారు.ఈ కోరాజీలేని సౌకర్యం మరియు భద్రతను అందిస్తుంది. ఈకోతోవ్యాన్‌ విభాగంలో బలమైన పట్టుసాధించగలమని మేము విశ్వసిస్తున్నాము. అన్నింటికి మించి మావాహనాలకు నిరంతర మద్దతు అందిస్తున్న వినియోగదారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close