Featuredప్రాంతీయ వార్తలు

వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి

భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు: బంధువుల ఆరోపణలు

వికారాబాద్ ఆదాబ్ హైదరాబాద్.ఒక వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ధరూర్ మండలం గట్టేపల్లి తండలో మంగళవారం రాత్రి జరిగింది పోలీసులు బంధువులు తెలియజేసిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మండలం రామ పూర్ తాండ చెందిన సంగీత తో గట్టేపల్లి తండాకు చెందిన శ్రీనివాస్ తో 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన శ్రీనివాస్ నేరాలకు అలవాటు పడ్డారు అందులో భాగంగానే భార్య సంగీత(21) ను మంగళ వారం రాత్రి ఇంట్లోనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపించారు గతంలో ఆటోడ్రైవర్ శ్రీనివాస్ ఒక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు నేరాన్ని అలవాటుపడ్డ శ్రీనివాస్ పథకం ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ విషయం తెలియగానే స్థానికులు ధరూర్ పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా సంగీతకు ఇద్దరు పిల్లలను ఒక బాబు ఒక పాప వారి పరిస్థితి దయనీయంగా మారింది పథకం ప్రకారం హత్య చేసిన సంగీత భర్త శ్రీనివాస్ కఠినంగా శిక్షించాలని సంగీత బంధువులు వికారాబాద్ ఏరియా ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు పోస్టుమార్టం అనంతరం పోలీసులు శవాన్ని బంధువులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close