భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

0

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 11,599 వద్ద, సెన్సెక్స్‌ 379 పాయింట్ల నష్టంతో 38,584 వద్ద ముగిశాయి. బుధవారం నుంచి చైనా-అమెరికా చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్‌ 25శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించడంతో మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి. ముఖ్యంగా లోహరంగ సూచీ 2శాతం నష్టపోయింది. నిఫ్టీ మీడియా సూచీ 1.5శాతం నష్టపోయింది. కాడిల్లా హెల్త్‌కేర్‌ 4శాతం నష్టపోయి 52వారాల కనిష్టస్థాయికి చేరింది. అమెరికా హెల్త్‌కేర్‌ రెగ్యూలేటర్‌ మోరియా ప్లాంట్‌లో 14 అభ్యంతరాలను చూపడంతో షేరు నష్టపోయింది. యస్‌బ్యాంక్‌ షేరు కూడా 5శాతం విలువ కోల్పోయింది. ఇక్రా రేటింగ్‌ ఏజెన్సీ ఈ బ్యాంక్‌ టైర్‌ 1, టైర్‌2 బాండ్లకు రేటింగ్‌ తగ్గించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గోల్డిమ్‌ ఇంటర్నెషనల్‌ షేర్లు 15శాతం విలువ పెరిగి52వారాల అత్యధికానికి చేరాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here