టీఆర్ఎస్ లో చేరిన మహా కూటమి నేతలు

0

జగిత్యాల నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్, టిడిపి నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. శుక్రవారం హైదారాబాద్ లో నిజామాబాద్ ఎంపి కవిత
సమక్షంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ జి.ఆర్ దేశాయ్, మాజీ కొన్సిలర్ మానాల కిషన్, ఎంబిసీ కులాల జిల్లా అధ్యక్షులు చదువుల కోటేశ్ , రజక సంఘం నాయకులు మర్రిపెల్లి నారాయణ, వొడ్నాల మహేష్, బాసెట్టి రాజేష్, గౌడ సంఘం నాయకుడు గుమ్మడి సత్యం, జయంత్, రాజ్ కుమార్ తదితరులు టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ తెలంగాణ సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వాములు అయ్యేందుకు టీఆర్ఎస్ లో చేరిన నాయకులకు అభినందనలు తెలియజేశారు.
జగిత్యాల జిల్లాపై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యకర్తల తో నేతలు సమన్వయం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు బండారి నరేందర్, గంగం స్వామి, రంగు గోపాల్, కత్రోజు గిరి, ప్రభాత్, తిరుపతి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here