మన్నె గోవర్థన్‌ రెడ్డికి అస్వస్థత

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… టికెట్‌ ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఓ వైపు అభ్యర్థులకు బీఫారంలు పంపిణీ చేసినా…టీఆర్‌ఎస్‌లో ‘ఖైరతాబాద్‌’ సీటు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఖైరతాబాద్‌ టికెట్‌ మన్నె గోవర్థన్‌ రెడ్డికి ఇవ్వాలంటూ… అతని అనుచరులు గత రెండు రోజులుగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌ ముట్టడికి వెళుతున్న మన్నె గోవర్ధన్‌ రెడ్డిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో మన్నె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటీన సిటీ న్యూరో సెంటర్‌ హాస్పటల్‌కు తరలించారు. మరోవైపు మన్నే అనుచరులు హాస్పటల్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త… తల బద్ధలు కొట్టుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే ఖైరతాబాద్‌ వద్ద సెల్‌ టవర్‌ ఎక్కి మన్నె అనుచరులు నిరసన తెలుపుతున్నారు. అంతకు ముందు తెలంగాణ భవన్‌ ఎదుట మన్నె అనుచరులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భైఠాయించి నిరసన తెలపగా, పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్థిచెప్పి అక్కడ నుంచి పంపించివేశారు. కాగా ఖైరతాబాద్‌ టికెట్‌..రేసులో దానం నాగేందర్‌, మన్నె గోవర్దన్‌ రెడ్డి, దివంగత పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here