మల్యాద్రి వైపే కాంగ్రెస్‌ చూపు

0

– బాన్సువాడలో పాగా కోసం కాంగ్రెస్‌ ప్రయత్నం

– తెరమీదకు సామాజిక సేవకుడు మల్యాద్రి రెడ్డి

– పోచారంకు ధీటైన అభ్యర్థి అని కాంగ్రెస్‌ హైకమాండ్‌ అంచనా

బాన్సువాడ, ఆదాబ్‌ హైదరాబాద్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గానీ,ప్రస్తుత కొత్త జిల్లా కామారెడ్డిలో గానీ బాన్సువాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిర పర్చుకుంది. 1957లో ఏర్పాటైన బాన్సువాడ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం ఏర్పాటైన మొదట్లో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉండేది. కానీ విలక్షణ నటుడు ఎన్‌టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ క్రమేపి తన ఉనికిని కోల్పోయింది. ఇక్కడి తాజా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వరుసగా గెలుస్తూ నియోజకవర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడనటంలో అతిశయోక్తిలేదు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మీద కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్‌ గెలిచి కాంగ్రెస్‌ పార్టీకి ఎంతోకొంత ఊపిరిపోశారు. కానీ 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత 2009, 2011,2014 ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోలేకపోయింది. రాష్ట్ర ఆవిర్బావం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుండి కాసుల బాలరాజ్‌ పోటీ చేసి ఓటమిని చవిచూశారు.దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయే అని నియోజకవర్గ ప్రజల మద్యకు బలంగా తీసుకువెళ్ళలేదని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తుంది.

– ఈసందర్బంలో పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా స్వస్తి చెప్పాలని దీటైన అభ్యర్థికోసం కాంగ్రెస్‌ పార్టీ అన్వేశించింది. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్దిగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తన ప్రచారాన్ని ప్రారంభించగా,కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా అనూహ్యంగా మల్యాద్రి రెడ్డి పేరును తెరమీదకు తీసుకురావడం వెనక పెద్ద చరిత్ర ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2018 సార్వత్రిక ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తుంది. అందులో బాగంగానే సామాజిక సేవకుడు వీఎంఆర్‌ ట్రస్టు చైర్‌ పర్సన్‌ మల్యాద్రి రెడ్డి పేరు తెరమీదకు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

– అద్యాపక వృత్తి నుండి రాజకీయాల వైపు

మల్యాద్రి రెడ్డిని బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడి ప్రముఖ కోచింగ్‌ సెంటర్‌లో తన ఉపాద్యాయ సేవలు అందిస్తుండేవాడు. ప్రస్తుతం స్వతహాగా ఒక కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి తన కోచింగ్‌ సెంటర్‌ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు సేవలు అందిస్తున్నాడు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల్లో కన్నా కీలకంగా ఉన్న పోలీసు శాఖలో మల్యాద్రి నిరుపేద విద్యా కుసుమాలు ఉన్నాయంటే తన సామాజిక సేవను అర్థం చేసుకోగలం.

సామాజిక సేవకుడిగా ..

ప్రస్తుతం మల్యాద్రి రెడ్డి తన స్వంత ట్రస్టు ఐన వీఎంఆర్‌ ద్వారా బాన్సువాడ నియోజకవర్గ నిరుపేద ప్రజలకు తన సేవలు అందిస్తూ ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరుపేదలకు అండగా నేనున్నానని తెలియజేస్తూ తన రాజకీయ జీవితంపై ముందడుగులు వేస్తున్నారు.

పోచారంకు సన్‌స్ట్రోక్స్‌…

తెలంగాణ ఆవిర్బావం తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా గెలుపొంది ఆవెంటనే మంత్రిగా ప్రమాణం చేయడం, మంత్రి వర్గ శాఖల కూర్పులో భాగంగా టీఆర్‌ఎస్‌ అదినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకమైన వ్యవసాయశాఖను పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన పోచారం గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో రైతుల ఆత్మహత్యలు, వలసలు అదుపులోకి తేలేకపోయాడని నియోజకవర్గ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈమద్యనే ప్రముఖ టీవీ చానల్‌ పెట్టిన ఒక కార్యక్రమంలో బాగంగా బాన్సువాడ నియోజకవర్గ రైతులు తమ ఆవేదనను బలంగా విలపించడం జరిగింది. ఒకానొక దశలో వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఉండటం బాన్సువాడ నియోజకవర్గ ప్రజల దౌర్బాగ్యంగా భావించారు. మంత్రిగా భాద్యతలు చేపట్టిన మంత్రిగా భాద్యతలు చేపట్టిన తర్వాత పోచారం తన కుమారులను అదుపులో పెట్టలేకపోయాడన్న భావన నియోజకవర్గ ప్రజల్లో బలంగా ఉంది. పోచారం కుమారుడు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ, స్టోన్‌ మాఫియా, క్రషర్‌ మాఫియాను ప్రోత్సహిస్తూ నియోజకవర్గ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ మాఫియాను ముందుండి నడిపారని యావత్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. ఒకానొక దశలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవసాయ శాఖ మంత్రిని తన క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని మందలించడం జరిగిందని అప్పట్లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. మళ్ళీ పోచారంను గెలపిస్తే పోచారం కుమారుల దోపిడిని అరికట్టలేమని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.

పెరిగిన కాంగ్రెస్‌ గ్రాఫ్‌ మల్యాద్రికి కలిసివచ్చేనా ..

బాన్సువాడ నియోజకవర్గం ఏర్పాటైన మొదట్లో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్‌పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తర్వాత కనుమరుగైందని చెప్పాలి. కానీ వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విఫలమవడం, టీఆర్‌ఎస్‌ పార్టీ హామీలు ఏఒక్కటి కూడా నియోజకవర్గంలో అమలు కాకపోవడం మరియు పోచారం కుమారుల ఆగడాలను కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళిందని చెప్పాలి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా బాన్సువాడ గడ్డమీద కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేయాలని దృఢ సంకల్పంతో మల్యాద్రి రెడ్డి ముందుకు వెలుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here