సినిమా వార్తలు

సఫ్‌ గేమ్‌ ఎలా ఆడాలో చెప్పిన మహేష్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలను నమ్మి వందల కోట్లు పెట్టుబడి పెడితే అది ఏ రిస్క్‌ లేకుండా సేఫేనా? అంటే ఎంత మాత్రం కాదు. ఈ మాటను స్టార్‌ హీరోలే నిజాయితీగా అంగీకరిస్తారు. కేవలం స్టార్‌ డమ్‌ సరిపోదు.. జనాలకు సినిమా నచ్చడం చాలా ఇంపార్టెంట్‌. అందుకు ప్రయోగాలకు పోకూడదని క్లాస్‌ తీస్కునే హీరోలు మనకు ఉన్నారు. ప్రతిదీ క్యాలిక్యులేటెడ్‌ గా వెళ్లే హీరోలు ఉన్నారు. మహేష్‌- ఎన్టీఆర్‌- రామ్‌ చరణ్‌- బన్ని- ప్రభాస్‌ లాంటి ఫామ్‌ లో ఉన్న స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మించాలంటే మినిమం బడ్జెట్‌ 50-100 కోట్ల మధ్య ఖర్చు అవుతోంది. అంతకు మించి బడ్జెట్‌ పెరుగుతోందే కానీ తగ్గే ప్రసక్తే లేదు. మార్కెట్‌ ను బట్టి మినిమంగా యాభై కోట్లు కేటాయిస్తున్నారు. ఈ స్టార్‌ హీరోలకు ఉన్న క్రేజ్‌ దష్ట్యా 100 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ సునాయాసం గా జరుగుతోంది. ఇది హీరోల సేఫ్‌ గేమ్‌ రిటర్న్స్‌ ని దష్టిలో పెట్టుకుని సాగే ఆట. ఎంచుకున్న కథలో కమర్శియల్‌ హంగులున్నాయా లేదా? అని చూసుకోవడంతో పాటు కొత్తదనం వైవిధ్యం కూడా చూస్తున్నారు ఇటీవల. ఒకవేళ ఫలితం తేడా కొట్టినా బయ్యర్లకు పెద్దగా నష్టాలుండని విధంగా సేఫ్‌ గేమ్‌ తప్పనిసరి అయ్యింది. అందుకే ప్రయోగాలు చేసే ముందు ఏ హీరో అయినా ఇవన్నీ ఆలోచించుకోవాలని మహేష్‌ అంటున్నారు. ఇటీవల రొటీన్‌ కంటెంట్‌ కు దూరంగా ఉన్నా.. పాత కంటెంట్‌ ను మాత్రం అంత తొందరగా విడిచి పెట్టి సాహసం చేయరు. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేష్‌ సరిలేరు నీకెవ్వరు సినిమా ఎలా ఉంటుందో ఇప్పటికే ఆయన రివీల్‌ చేసారు. కొత్త స్క్రిప్ట్‌ కాదు… దూకుడు తరహాలో సాగే స్టోరీ… కావాల్సిన ఫన్‌ ఉంటుందని అన్నారు. ఇక మహేష్‌ గత ప్రయోగాల గురించి తెలిసిందే. శ్రీమంతుడు- భరత్‌ అనే నేను- మహర్షి ఈ మూడు రిస్క్‌ జోన్‌ లో చేసిన సినిమాలు. లైట్‌ కమర్శియల్‌ టచ్‌ తో వచ్చిన సినిమాలివి. అయితే ఇలాంటి ప్రయోగాలు ప్రతిసారీ సరికాదని మహేష్‌ మరోసారి ఉద్ఘాటించారు. ప్రయోగాలు చేయడం బాగానే ఉంటుంది గానీ! అన్నివేళలా కరెక్ట్‌ కాదని తాజా ఇంటర్వ్యూ లో తెలిపారు. తనతో పాటు మిగతా పెద్ద హీరోలంతా విచిత్రమైన జోన్‌ లో ఉన్నారని…ప్రయోగాలు చేద్దామంటే చాలా విషయాలు ఆలోచించి వెనకడుగు వేయాల్సి వస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వందల కోట్లు పెడుతున్నప్పుడు అన్ని అంశాలు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. అదే సమయంలో కథలో కొత్తదనం ఉండాలి… ఇవన్నీ కుదిరినప్పుడు ముందుకెళ్లొచ్చు… తొందరపడితే ఫలితాలు ఘోరంగా ఉంటాయని అన్నారు. నిజమే ఓ నటుడిని నమ్మి వందల కోట్లు పెట్టినప్పుడు వాటికి బాధ్యత వహించాల్సింది హీరో.. దర్శకుడే కదా.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close