‘మహర్షి’ వసూళ్ల జోరు

0

హైదరాబాద్‌: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తున్నట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. తొలిరోజున ఈ చిత్రం నైజాంలో రూ.6.38 కోట్లు, యూఏలో రూ2.88 కోట్లు, సీడెడ్‌లో రూ.2.89 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.2 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.2.47 కోట్లు, కష్ణలో రూ.1.39 కోట్లు, గుంటూరులో రూ.4.4 కోట్లు, నెల్లూరులో రూ.1 కోటి.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కలిపి రూ.24.6 కోట్లు (షేర్‌) రాబట్టినట్లు అంచనా వేశారు. రెండో రోజు కూడా వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్వినీదత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. గురువారం ప్రేక్ష కుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విశేషమైన స్పందన లభించింది. మహేశ్‌ నటన, కథ, వంశీ టేకింగ్‌ అద్భుతంగా ఉన్నాయని చిత్ర బందాన్ని ప్రముఖులతో పాటు నెటిజన్లు ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here