మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు

0

జయశంకర్‌ భూపాలపల్లి, (ఆదాబ్‌ హైదరాబాద్‌): గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు వడ్డెలు(ప్రధాన పూజారులు) తేదీలను ఖరారు చేశారు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి కోట్లాది మంది భక్తుల దర్శనంతో కొనసాగుతుంది. 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకూ జాతర ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రధాన పూజారులు వెల్లడించారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజులు, 6న సమ్మక్కలు గద్దెపైకి రానున్నారని, 7వ తేదీన గద్దెలపైకి ఇద్దరు వన దేవతలకు పూజలు చేపడుతామని, 8వ తేదీన సమ్మక్క, సారలమ్మ లు వన ప్రవేశం చేస్తారని పూజారులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here