Featuredస్టేట్ న్యూస్

ప్రేమ.. పగ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమోన్మాది కర్కశత్వానికి మరో యువతి తీవ్రంగా గాయ పడింది. నగరంలోని కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బర్కత్‌పుర సత్యానగర్‌లో ఓ యువతిపై భరత్‌ అనే ప్రేమో న్మాది కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. మెడ, పొట్టపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయప డింది. ఆమె పరిస్థితి విషమించడంతో స్థానికులు మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలిం చారు. వీరిద్దరూ సత్యానగర్‌ కాలనీలో పక్కపక్క ఇళ్లల్లోనే నివాసముంటు న్నారు. తనను ప్రేమించాలంటూ భరత్‌ గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల క్రితం పోలీసులు భరత్‌తోపాటు యువతి, ఆమె తల్లిదండ్రులను భరోసా కేంద్రానికి రప్పించి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో యువతి బుధవారం ఉదయం కళాశాలకు వెళ్లే సమయంలో కొబ్బరి బొండాల కత్తితో

ఒక్కసారిగా దాడి చేశాడు. భరత్‌పై వేధింపుల కేసు పెట్టినందునే ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. భరత్‌ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినా ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. భరత్‌ చేసిన దాడిలో మొత్తం బాలికకు 14 నుంచి 15 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. రెండు చేతులు వీపుపై గాయాలయ్యాయి. ఎడమ చేతి చిటికన వేలు పూర్తిగా తెగి పడింది. 48 నుంచి 72 గంటలు గడిస్తే తప్ప బాలిక ఆరోగ్య పరిస్థితి చెప్పలేమంటున్నారు బాలికకు చికిత్స చేస్తున్న యశోదా ఆసుపత్రి వైద్యులు. వెంటిలేషన్‌ పై ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని మలక్‌ పేట యశోదా ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. యువతిపై దాడికి పాల్పడ్డ యువకుడిని భరత్‌గా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాధితురాలు మధులిక ఓ ప్రయివేటు కాలేజీలో చదువుతోంది. అయితే పొరుగింట్లో ఉన్న భరత్‌.. తనను ప్రేమించాలని మధులిక వెంట పడ్డాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు మధులిక చెప్పింది. దీంతో జనవరి నెలలో షీటీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భరత్‌ కు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? తనను ఎందుకు ప్రేమించడం లేదని మధులికను వేధించడం మొదలుపెట్టాడు. ప్రేమోన్మాదిగా మారిన భరత్‌.. ఇవాళ ఉదయం మధులిక కాలేజీకి వెళ్తున్న క్రమంలో ఆమెపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. మధులిక తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఆమె వెంట పరుగెత్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. బాధితురాలికి మెడ భాగంపై తీవ్రంగా గాయమైంది. చేతి నాలుగు వేళ్లు తెగిపోయాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురిపై కక్ష గట్టిన తండ్రి.. గతేడాది సెప్టెంబర్‌ లో ఎర్రగడ్డలో పట్టపగలే ఆ నవదంపతులపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి నుంచి అల్లుడు తప్పించుకోగా, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రేమోన్మాది భరత్‌ అరెస్ట్‌

బర్కత్‌ పురాలో మధులిక అనే మైనర్‌ బాలిక పై ప్రేమ పేరుతో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్‌ ను పోలీసులు అరెస్టు చేసారు. బుధవారం సాయంత్రం అతడ్ని విూడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. – – – ————————

ఈస్ట్‌ జోన్‌ డిప్యూటీ కవిూషనర్‌ ఆధ్వర్యంలో, 4 టీమ్‌ ల ద్వారా గాలింపు జరిపి కాచిగూడ ప్రాంతంలోని ఒక ఇంటిలో తలదాచుకున్న భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై దాడి చేసిన తర్వాత నిందితుడు కాచిగూడ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించటం, భరత్‌ సంచరించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి ఆధారంగా భరత్‌ కదలికలు కనిపెట్టిన పోలీసులు ఒక ఇంటిలో తలదాచుకున్న భరత్‌ ను అదుపులోకి తీసుకున్నారు. మధులిక పై దాడి చేసేందుకు ఉపయోనగించిన కొబ్బరి బొండాల కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భరత్‌ సెల్‌ పోను ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భరత్‌కు నేరచరిత్ర లేదన్న డీసీపీ

మధులికపై దాడికి పాల్పడిన భరత్‌కు నేర చరిత్ర లేదని ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేష్‌ రెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన తన కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. భరత్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఆయన చెప్పారు. ఈ దాడికి పాల్పడిన తర్వాత భరత్‌ కత్తిని ఇంట్లోనే వదిలి వెళ్లినట్టు ఆయన చెప్పారు. భరత్‌ కూడ ఈ దాడి ఘటనతో షాక్‌లో ఉన్నారన్నారు. భరత్‌ను విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.భరత్‌పై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నంతో పాటు ఫోక్స్‌ చట్టం కింద కూడ కేసును నమోదు చేశామని ఆయన తెలిపారు. మధులిక శరీరంపై పలు చోట్ల గాయాలైనట్టుగా ఆయన చెప్పారు.నెల రోజుల క్రితం భరోసా సెంటర్‌కు రెండు కుటుంబాలు వెళ్లి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకొన్నారని డీసీపీ చెప్పారు. కానీ, భరత్‌ ఇవాళ దాడి చేస్తారని భావించలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

దాడికి పాల్పడిన నింధితుడిని ఉరి తీయాలి : తండ్రి రాములు

హైదరాబాద్‌ బర్కత్‌ పురలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. తన కూతురుపై దాడికి పాల్పడిన భరత్‌ ను ఉరి తీయాలని తండ్రి రాములు డిమాండ్‌ చేశారు. గతంలోనే షీటీం అధికారులు మందలించినప్పటికీ ఇంతటి దారుణానికి ఒడిగడుతాడని అనుకోలేదంటూ బోరున విలపించారు. బాలికపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డారన్న సమాచారం తెలుసుకున్న అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం బీజేపీ నేత కిషన్‌ రెడ్డి సహా పలువురు బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. యశోదా ఆసుపత్రి సందర్శించి బాధితురాలికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా దాడి జరిగిందన్నారు కిషన్‌ రెడ్డి. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన అమ్మాయిలు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై జరిగిన దాడికి పాల్పడిన ప్రేమోన్మాది భరత్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close