వారమంతా నష్టాలలోనే…

0

ముంబయి: దేశీయ మార్కెట్ల నష్టకష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో విదేశీ మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడం, రూపాయి విలువ బలహీనపడటం, దేశీయంగా కీలక రంగాల షేర్లు పడిపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో ఈ వారమంతా కుదేలైన సూచీలు చివరిరోజైన శుక్రవారం కూడా నష్టాలతోనే ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ దాదాపు 100 పాయింట్లు పతనమవగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 11,300 మార్క్‌ను కోల్పోయింది. అమెరికా-చైనా వాణిజ్య అనిశ్చితులతో ఈ ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆరంభంలో లాభాల్లో కన్పించినప్పటికీ ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌తో పాటు బ్యాంకింగ్‌, లోహ, ఐటీ, ఫార్మా, ఎనర్జీ, ఆటోమొబైల్‌ రంగాల షేర్లు కుదేలవడంతో ఒత్తిడికి గురైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 96 పాయింట్లు దిగజారి 37,463 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 11,279 వద్ద ముగిశాయి. టాటాస్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టపోగా.. ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్‌, టైటాన్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తదితర షేర్లు లాభపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here