నిరసనలతో అట్టుడికిన లోక్‌సభ..

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నిరసనలతో అట్టుడికింది. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినకపోవడంతో సభను గురువారంకు వాయిదా వేశారు. బుధవారం లోకసభ ప్రారంభం కాగానే రాఫెల్‌ స్కాంపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేయాలని కాంగ్రెస్‌ పట్టు పట్టింది. అలాగే కావేరి నది జలాలపై ఏఐడీఎంకే, ఏపీకి ఇచ్చిన హావిూలు అమలు చేయాలని టీడీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీనిపై చర్చకు సభాపతి తిరస్కరించడంతో కాంగ్రెస్‌, టీడీపీ, ఏఐడీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టారు. మరోవైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టాలని శివసేన ఎంపీల డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ మళ్లీ ప్రారంభమైంది. అయితే మరోసారి ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సభను గురువారం వాయిదా వేశారు. అంతకుముందు కర్ణాటక నుంచి ఇద్దరు ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల కర్ణాటకలోని బళ్లారి, మండ్య లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బళ్లారిలో కాంగ్రెస్‌ నేత ఉగ్రప్ప, మండ్యలో జేడీఎస్‌ నేత శివరామ గౌడ విజయం సాధించారు. ఈ ఇద్దరు బుధవారం లోక్‌సభలో ఎంపీలుగా ప్రమాణం చేశారు.

పార్లమెంట్‌ ఆవరణలో టిడిపి ఆందోళన

పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఏపీకి చెందిన తెదేపా ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎంపీలు అశోక్‌ గజపతి రాజు, టీజీ వెంకటేశ్‌, మురళీ మోహన్‌, శివప్రసాద్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్‌ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు శ్రీకాకుళంపై విరుచుకుపడిన తిత్లీ తుపాను విషయంలో కేంద్ర సాయంపై చర్చించాలంటూ రూల్‌ 377 కింద శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు నోటీసు ఇచ్చారు. తుపాను వల్ల రూ. 3,435 కోట్ల మేర నష్టం వాటిల్లితే కేవలం రూ.539.52 కోట్ల సాయం కేంద్రం విడుదల చేయడంపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here