లోకల్‌ పోర్‌కు రెడీ

0

535 జెడ్పీటీసీ, 5857 ఎంపీటీసీ స్థానాలు

  • వ్యూహాలు, ప్రణాళికలపై చర్చ
  • నేడు కార్యవర్గ విస్తృత సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ సన్నద్దమవుతోంది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గులాబీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. నేడు తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ఎస్‌ కార్యవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రెడీ అయ్యారు. సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నిర్ణయించారు. ఈ సమావేశంలో.. పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు, ప్రణాళికలపై చర్చించున్నారు గులాబీ అధినేత! జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు టీఆర్‌ఎస్‌ రెడీ అవుతోంది. లోకల్‌ బాడీల నుంచి లోక్‌సభ వరకు అన్ని స్థాయిల్లో గులాబీనేతలే ఉండాలనే లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్‌ ముందుకెళ్తున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులతోపాటు రాష్ట్రమంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలుగా పోటీచేసిన అభ్యర్థులు, మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ సభ్యుల స్థానాలకు, 5857 ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తులపై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం విస్తృతంగా చర్చిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికల్లోనూ ఏకపక్ష విజయం ద్వారా అన్ని స్థాయిల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఉంటే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా, వేగంగా సాగుతాయని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా కృషిచేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌ ఆ తర్వాత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపు 80 శాతానికి పైగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. లోక్‌ సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. స్థానిక ఎన్నికల్లోనూ అన్ని స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, లోక్‌ సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన అభ్యర్ధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్యనాయకులను పార్టీ కార్యవర్గ విస్తృత సమావేశానికి ఆహ్వానించారు.

రెవెన్యూశాఖను రద్దు చేసే యోచనలో సీఎం కేసీఆర్‌

అవినీతి రహిత పాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. అడ్మినిష్ట్రేషన్‌ విధానాన్ని సరికొత్తగా రూపొందిస్తున్నారు. సమర్థవంతమైన అధికారులతో పరిపాలన సాగించేందుకు సంస్కరణలు చేపడుతున్నారు. సివిల్‌ సర్వెంట్స్‌ తరహాలోనే రాష్ట అధికారులను తయారు చేసి, వారికి పనులు అప్పగించేందుకు కొత్త చట్టాలకు రూపాకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూశాఖను రద్దు చేస్తారని సమాచారం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి ఏర్పటైన తర్వాత సీఎం కేసీఆర్‌ పరిపాలన విధానంలో నూతన సంస్కరణలు తీసుకురానున్నారు. అధికారులు ప్రజలకు చేరువలో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. సమర్థవంతమైన ప్రభుత్వోద్యోగులతో పాలనను పరుగులు పెట్టించేందుకు చట్టాలను రూపొందించనున్నారు. సివిల్‌ సర్వీస్‌ తరహాలోనే తెలంగాణ అడ్మినిష్ట్రేటివ్‌ సర్వీసును ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్‌ కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో కలెక్టర్‌ సారధ్యంలో సీనియర్‌ అధికారుల నాయకత్వంలో పటిష్టమైన అధికార వ్యవస్థ ఉండబోతోంది. ప్రస్తుతం జిల్లా స్థాయిలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఆయా పేర్లను తొలగించి కలెక్టర్‌ నాయకత్వంలో అదనపు కలెక్టర్‌తో పాటు, అదనపు జిల్లా పరిపాలన అధికారులుగా పిలిచే ముఖ్య అధికారుల బృందంతో జిల్లా స్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఇప్పటికే పరిపాలన సంస్కరణలో భాగంగా రెవెన్యూశాఖను రద్దు చేసే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ శాఖకు చెందిన ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు పనులు మొదలైనట్టు సమాచారం. అయితే రెవెన్యూశాఖ రద్దుపై సదరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పారదర్శకమైన పాలన అందించేందుకు అవసరమైన చట్టాన్ని రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు సీఎం కేసీఆర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here