నేడు స్థానిక పోరు

0

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత ఎన్నికలు..
  • బ్యాలెట్‌ల ద్వారా ఎన్నికలు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. సోమవారం తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. స్థానికసంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌.. పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్ధులు ¬రా¬రీగా ప్రచారాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఎంపీటీసీకి వైట్‌ కలర్‌, జడ్పీటీసీకి పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. 3 దశల్లో ఎన్నికల జరుగనుండగా.. మొదటి విడతలో 197 జడ్పీటీసీ, 2 వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తొలి విడత ఎన్నికల్లో కొన్ని చోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయి. తొలి విడతలో నిజామాబాద్‌లో మాక్లూరు, జగిత్యాలలో జిల్లాలోని కోరుట్ల జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. తొలి విడతలో 2166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2097 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో జిఖుఅ, ఓఖుఅ తొలివిడత ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. రేపు తొలి విడత ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే ప్రచారానికి తెరపడింది. స్థానికసంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు టీఆర్‌ఎస్‌.. పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్ధులు ¬రా¬రీగా ప్రచారాన్ని నిర్వహించారు. తొలి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో.. సభలు, ర్యాలీలు నిర్వహించరాదంటూ ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. టీవీలు, రేడియోల్లోనూ ప్రచారం నిషేధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. తొలి విడత పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండరాదని సూచించింది. ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా ప్రాంతాలను వదలి వెళ్లాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఎంపీటీసీకి వైట్‌ కలర్‌, జడ్పీటీసీకి పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. 3 దశల్లో ఎన్నికల జరుగనుండగా.. మొదటి విడతలో 197 జడ్పీటీసీ, 2 వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. తొలి విడత ఎన్నికల్లో కొన్ని చోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవుతున్నాయి. తొలి విడతలో నిజామాబాద్‌లో మాక్లూరు, జగిత్యాలలో జిల్లాలోని కోరుట్ల జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. తొలి విడతలో 2166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2097 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. చివరి రోజు ప్రచారం కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణిలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బడుగుల లింగయ్య, వేముల వీరేశం ఎదురుకావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అలాగే తొలి విడత ఎన్నికలు జరుగుతున్న వలిగొండ మండలం తుర్కపల్లిగ్రామంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్లదాడికి దిగారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు హరిప్రియా నాయక్‌. దీంతో ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు.. కామేపల్లి మండలం గోవింద్రలలో హరిప్రియను అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ నేతల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్‌,టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను చెదరగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here