Featuredస్టేట్ న్యూస్

ప్రమాదాలు వద్దు ప్రాణాలే ముఖ్యం

-రోడ్డు భద్రత వారోత్సవాల్లో పాల్గొన్న ఎస్సై రాము

-ప్రయాణికులు జాగ్రత్త పాటించాలి

సంగారెడ్డి (ఆదాబ్‌హైదరాబాద్‌): జహీరాబాద్‌ నియోజకవర్గంలోని కోహీర్‌ మండలంలోని కవేలి చౌరస్తాలోని 65జాతీయ రహదారిపై కోహీర్‌ ఎస్సై రాము బోపుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు రోడ్డు దాటుతుం డగా తప్పనిసరిగ అండర్‌ పాస్‌ ను పాటించాలన్నారు. రాత్రివేళల్లో రోడ్డు దాటుతున్నప్పుడు తప్పని సరిగా టార్చిలైట్‌ వాడాలన్నారు. వ ద్దులు చిన్నపిల్లలు రోడ్డు దాటుతున్నప్పుడు తప్పనిసరిగా ఇతరుల సహాయం తీసుకోవాలన్నారు. అంతే కాకుండ అతి వేగంగా వస్తున్నా వాహనాలు వెళ్లిన తర్వాత రోడ్డు దాటాలన్నారు. పాడి రైతులు పశువులను రోడ్డు పక్కన మేపకుండ జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. వాహన దారులు రాంగ్‌ రూట్లో వాహనాలు నడపరాదు. అటువంటి సమయంలో ప్రమా దాలు జరిగే ఆస్కారం ఉందని గమనించాలి. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్‌ ధరించాలి లేని ఎడల వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఎవరైనా మధ్యం సేవించి వాహనం నడిపిన పరిమితి మించి వాహనాలపై ప్రయాణం చేసిన చట్టరీత్య చర్యలు తీసుకోవడంతో పాటు జైలు శిక్షకు అర్హులు అన్నారు. ఆటో మరియు పెద్దపెద్ద వాహనాలు నడిపే ప్రతిఒక్కరు సీటు బెల్ట్‌ తప్పనిసరిగా ధరించి ప్రజలు ఉన్న చోట వాహనాలు జాగ్రత్తగా నడపాలి ఆయన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది రాక్‌ వుల్‌ పరిశ్రమ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close