Featuredస్టేట్ న్యూస్

జీహెచ్‌ఎంసీలో లంచాలకు సజీవ సాక్ష్యం

కూకట్‌ పల్లి హౌసింగ్‌ బోర్డులో కమిషనర్‌ పేరిట అక్రమ వసూళ్లు

సర్దార్‌ పటేల్‌ నగర్‌ కేంద్రంగా భారీ అక్రమ నిర్మాణ భవనం

టౌన్‌ ప్లానింగ్‌లో చైన్‌ మెన్‌ నుంచి ఏసీపీ వరకు బిల్డర్లతో అక్రమ సంబంధాలు

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులకు స్పందించిన విజిలెన్స్‌ కదులుతున్న డొంక

కూకట్‌పల్లి (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఒక్క బిల్డింగ్‌ కు పర్మిషన్‌ తీసుకొని వేసుకుంటే ఇచ్చే లంచం వధా అవు తుంది అని ఆలో చించిన ఒక సామాన్య బిల్డర్‌, సర్దార్‌ పటేల్‌ నగర్‌ కేంద్రంగా ఒక భారి బిల్డింగ్‌ నిర్మాణానికి స్కెచ్‌ గీసి విజయం సాధించిన సంద ర్భంలో మిగతా సక్రమంగా ప్లాన్‌ ప్రకారం కట్టి నష్టాల బాటలో ఉన్న బిల్డర్లకు ఆదర్శంగా నిలబడ్డ సంఘటన కెపిహెచ్‌బి డివిజన్‌ సర్దార్‌ పటేల్‌ నగర్‌లో జరిగింది. ఇతను ఎంత తెలివిగా ఎట్లా నిర్మించారు అని పలువురు బిల్డర్లు ప్రశ్నించగా ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అని కేవలం టౌన్ప్లానింగ్‌ అధికారులు ఇచ్చిన సలహా మాత్రమే తీసుకున్నానని తెలియజేసినాడు, కాక పోతే కొంచెం బారిగానే కాసుల వదిలినట్లు తన మిత్ర బందానికి తెలియజేసినట్లు తెలియవచ్చింది. నేను రెండు పర్మిషన్లు పేరిట మొత్తం 6 ఫ్లోర్లు ఎక్కువ వేసుకున్న నని ఫ్లోర్‌ కు రెండు ప్లాట్లు చొప్పున మొత్తం 12 ప్లాట్లు అక్రమంగా వేసుకున్నారని లంచం పోయినా పర్వాలేదు సహకరించి అధికారి ఎక్కడ దొరుకుతాడు అని తనలో తానే సంతోష పడ్డట్లు తెలియవచ్చింది. ప్లాన్‌ ప్రకా రం కూల్చివేతసర్దార్‌ పటేల్‌ నగర్‌ లో రెండు బిల్డింగ్‌ లో గల పర్మిషన్‌ తీసుకుని యధేచ్చగా ఒకటే భారీ అక్రమ నిర్మాణం చేప డుతున్న బిల్డర్‌కు మొదటి నుంచి టౌన్‌ ప్లానింగ్‌ లో చైన్‌ మెన్‌ నుంచి ఏసిపి వరకు మంచి సంబంధాలు కొనసాగించడం అలవా టు అని తెలిసింది. ఇప్పటివరకు తను కట్టిన ప్రతి బిల్డింగ్‌ కూల్చి వేతకు గురికాకుండా కాపాడుకున్నాడు అంటే టౌన్‌ ప్లానింగ్‌ తో తన సంబంధాల సత్తా ఏమిటో గమనించాలని బాహాటంగానే చెప్పేవాడని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కడు తున్న బిల్డింగ్‌ కూడా అధికారి దయవల్లనే చేపట్ట గలిగానని స్థాని క కాలనీ నీ అసోసియేషన్‌ ల మాటలు కూడా పట్టించుకునే వాడు కాదని సర్దార్‌ పటేల్‌ నగర్‌ కాలనీ వాసులు తెలియజేశారు. ఎవరైనా ట్విట్టర్‌, లేదా లిఖితపూర్వకంగా, ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రం పైన ఉన్న స్టీల్‌ కట్‌ కాకుండా కూల్చివేసి పై అధికా రుల కు ఫోటో పంపుతామని తెలియజేసినట్లు ఇంకా అవసరమైతే కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం అని ఇదంతా మామూలు విషయ మే భయపడవద్దని తెలియజేసినట్లు తెలిసింది. భారీ కట్టడం పై విజిలెన్స్‌ నజర్‌ సర్దార్‌ పటేల్‌ నగర్‌లో భారీ అక్రమ కట్టడం నిర్మించి దానిపై మొత్తం రెండు కలిపి 6 ఫ్లోర్లు నిర్మించడం పై ఇప్పటికే కొంతమంది తెలంగాణ విజిలెన్స్‌ కు ఫిర్యాదు చేసినట్లు తెలియవచ్చింది.

ప్లాట్‌ నెంబర్‌ 16-2-227/254,లో పర్మిట్‌ నెంబర్‌: 12038, 12037 పేరుతో పర్మిషన్‌ తీసుకుని ట్రైన్‌ ప్లానింగ్‌ సహకారంతో అక్రమంగా భవనం నిర్మించడంతో విజి లెన్స్‌ అధికారులు రెక్కీ నిర్వహించి అధికారుల పాత్రపై ఆరా తీసి నట్లు తెలియవచ్చింది. ఇప్పటివరకు జరిగిన ప్రతి కట్టడంలో అధికారి సహకరించిన నాకు ఎవరు ఎదురు లేరు అని భావిస్తున్న తరుణంలో, ఈ భవనం విషయంలో మాత్రం శాఖాపరమైన చర్య లు తప్పక పోవచ్చునని అనుమానించిన అధికారులు ఇప్పటికే ఉన్నత స్థాయిలో వ్యవహారం నడిపిస్తున్న తెలియ వచ్చింది. కానీ అక్రమ కట్టడాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే భారీ జరి మానాలు, శిక్షలు, విధించడానికి చట్టం రూపొందించడానికి ఆదే శించిన పక్షంలో ఆరోపణలు ఎదుర్కొం టున్న కట్టడాన్ని సీజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పట ికైనా జి హెచ్‌ ఎం సి విజి లెన్స్‌ మౌనం వహించకుండా దాడులు కొనసాగించక పోతే తెలం గాణ స్టేట్‌ విజిలెన్స్‌ ఆ పని చేయడా నికి కొరడా జులుపిస్తుందిని ప్రజలు ఆశిస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close