ప్రత్యక్షప్రసారాలు చెయ్యం

0

అయోధ్య కేసులో స్పష్టంచేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు6(ఆర్‌ఎన్‌ఎ) : ఆయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు రోజువారి విచారణ చేపట్టనుంది. కాగా ఈ విచారణ ప్రక్రింయను ప్రతీరోజు ప్రత్యక్ష ప్రసారం లేదా రికార్డింగ్‌ చేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ప్రత్యక్ష ప్రసారాలు చెయ్యలేమని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే.. రామజన్మభూమి-బాబ్రీమసీదు (అయోధ్య) వివాదంపై రోజువారీ విచారణ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ప్రారంభమైంది. విచారణను ప్రత్యక్షప్రసారం లేదా రికార్డింగ్‌ చేయాలని కేఎన్‌ గోవిందాచార్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలాంటిదేవిూ ఉందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. మధ్యవర్తుల ద్వారా ఈ సమస్యను పరిష్కారించాలన్న ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే దీనిపై గతవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. అయోధ్య అంశంలో సామరస్యానికి మధ్యవర్తిత్వ కమిటీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని అభిప్రాయపడింది. దీంతో దీనిపై తామే రోజువారీ విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here