మానవత్వానికి చిరునామా లిట్రసీ హెల్పింగ్ హ్యాండ్స్

0

నిరక్షరాస్యతపై యుద్ధం, అక్టోబర్ 28న క్రీడా సీజన్ 2
ఆదాబ్ హైదరాబాద్ : నిరక్షరాస్యతా నిర్మూలన కోసం 2016లో 7 గురు సభ్యులతో కలిసి లిట్రసీ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సొసైటీని స్థాపించడం జరిగింది. ప్రస్తుతం 70 మంది యువకులతో కలిసి అక్షరాస్యతను పెంచేందుకు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా డిజిటల్ విద్యార్ధి అను కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపట్ల,కంప్యూటర్ పరిజ్ఞానం పట్ల ఉచిత శిక్షణ ఇచ్చి వారికి పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈకార్యక్రమంలో సుమారు 1500 మంది విద్యార్థులకు పైగా డిజిటల్ అక్యరాస్యులుగా తీర్చిదిద్దారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎల్ హెచ్ హెచ్ ఆధ్వర్యంలో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రముఖ కంపెనీల సీఈవోలచే వారికి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో, అనాధ శరణాలయాల్లోని విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం పైనే కాకుండా వివిధ కళల పట్ల నైపుణ్యతను పెంపొందించడానికి చిత్రలేఖనం మరియు కమ్యూని కేషన్ స్కిల్స్ పై, వ్యక్తిగత సామర్యం పెంచడానికి తోడ్పడే పలు కార్యక్రమాలు లిట్రసీ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థవారు నిర్వహించి వాటిల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను గుర్తించి సర్టిఫికెట్లను అందించి వారికి


తగు సహకారం అందించి ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవేకాక ఫిజికల్ లిట్రసీలో భాగంగా ఈనెల 27, 28 తేదీల్లో సికింద్రాబాద్ రైల్వే నిలయం వద్దగల ఆర్ఆర్ సి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో క్రీడా సీజన్-2′ అను కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని,బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు సంస్థ వస్థాపకుడు సీహెచ్. అక్షయ్ తెలిపారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనాలనే అభ్యర్థులు ఎంట్రీఫీజు సింగిల్స్ రూ. 300, డబుల్స్ 500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈటోర్నమెంట్ నిర్వహణలో మీడియా పార్ట్ నర్ గా ఆదాబ్ హైదరాబాద్ వ్యవహరించడం జరుగుతుందన్నారు. వివరాలకు ఫోన్. 8341854464 నంబరులో సంప్రదించాలన్నారు. ఈకార్యక్రమ నిర్వహణ ద్వారా వచ్చిన డబ్బును సేకరించి అవార్డ్స్ ఫౌండేషన్లో ఉన్న 14 మంది అనాధ బాలికలకు వారి చదువుకు అయ్యే ఖర్చును లిట్రసీ హెల్పింగ్ హ్యాండ్స్ వారు చెల్లించడం జరుగుతుంది. వారు ప్రస్తుతం స్నేహపురి కాలనీలోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ లో విద్యను అభ్యసిస్తున్నారు. రక్షరాస్యతను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో హెల్పింగ్ హ్యాండ్స్ అను సంస్థను స్థాపించడం జరిగిందని వారు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here