Featuredజాతీయ వార్తలు

మాటల్లేవ్‌.. మాట్లాడుకోవటాల్లేవ్‌..

  • ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్‌ కట్టుబడి ఉంది
  • ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలను బహిష్కరించాలి
  • షాంఘై సహకార సదస్సులో పాక్‌కు ప్రధాని మోడీ పరోక్ష హెచ్చరికలు

బిష్కెక్‌ : కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌ వేదికగా షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీఓ) సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్‌ 13 నుంచి 14 వరకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ హాజరయ్యారు. ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా మోదీ ఇదే వేదికగా పావులు కదపనున్నారు. ఈ సందర్భంగా జరిగిన తొలిరోజు సమావేశంలో ఆయా దేశాల నేతలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. మోదీ అన్ని దేశాల నేతలతో మాటలు కలిపారు గానీ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో మాత్రం మాట్లాడలేదు. సమావేశం అనంతరం కిర్గిస్థాన్‌ అధ్యక్షుడు సూరన్‌బే జీన్‌బెకోవ్‌ నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్‌ఈవోలో పాల్గొన్న అందరూ నేతలూ పాల్గొన్నారు. ఇక్కడ మోదీ, ఇమ్రాన్‌ ఖాన్‌ కలిసి కూర్చోలేదని సమాచారం. అంతేకాదు విందు సమయంలోనూ ఇద్దరు ప్రధానులు కుశల ప్రశ్నలు వేసుకోలేదని ఓ ప్రముఖ ఆంగ్లవిూడియా తెలిపింది. దీంతో వీరిద్దరి గురించి అక్కడి నేతల మధ్య చర్చ కూడా వచ్చింది. ఎస్‌సీవో వేదికగా మోదీ అన్ని దేశాల నేతలతో సమావేశమవనున్నారు. కానీ ఇమ్రాన్‌ ఖాన్‌తో మాత్రం భేటీ లేనట్లేనని తెలుస్తోంది. ఎస్‌సీవో సదస్సు ప్రారంభానికి ముందు కలిసి చర్చించుకుందామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌, పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇద్దరూ భారత్‌కు విడివిడిగా లేఖలు రాశారు

ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్‌ అన్ని విధాల కట్టుబడి ఉందని  ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా దాయాది దేశం పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఎదుటే పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించే దేశాలు జవాబుదారీగా ఉండాలని అన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, దాన్ని అరికట్టాలని మోదీ అన్నారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలను బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎస్‌సీవో దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలని కోరారు. ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్‌ కట్టుబడి ఉందన్నారు. ఎస్‌సీవోలో భారత్‌ రెండేళ్లుగా శాశ్వత సభ్యదేశంగా ఉందని, ఈ రెండేళ్లలో ఎస్‌సీవో చేపట్టే అన్ని కార్యక్రమాలకు సానుకూల సహకారం అందించామని మోదీ తెలిపారు. అంతర్జాతీయ వేదికపై ఎస్‌సీవో విశ్వసనీయతను పెంచేందుకు మున్ముందు మరింత సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా శ్రీలంకలో ఉగ్రదాడిని గురించి కూడా మోదీ ప్రస్తావించారు. 'అక్షరాస్యత, సంస్కృతి సంప్రదాయాలు సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంచుతాయన్నారు. యువతలో తీవ్రవాద భావజాల వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌సీవో సభ్య దేశాలకు మోదీ హెల్త్‌ మంత్రాన్ని చెప్పారు. హెల్త్‌ (హెచ్‌ఈఏఎల్‌టిహెచ్‌) లో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉందని వివరించారు. 'ఊ అంటే హెల్త్‌ అండ్‌ మెడికేర్‌(ఆరోగ్య సహకారం), ఇ అంటే ఎకో(పర్యావరణ సహకారం), ం అంటే ఆల్టర్నేట్‌ కనెక్టివిటీ(సముద్రమార్గం ద్వారా ప్రత్నామ్నాయ అనుసంధానం), ఒ అంటే లిటరేచర్‌(అక్షరాస్యతపై అవగాహన), టి అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ(ఉగ్రవాద రహిత సమాజం), ఊ అంటే హ్యుమానిటీ(మానవత్వ సహకారం)' అని మోదీ చెప్పుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు పరస్పరం హెల్త్‌ సహకారం అందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. 
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close