చదువుకుందాం కాస్తా.. ‘చదువుకొందాం’గా మార్చారు

0

మజ్లీస్‌కు ప్రతిపక్ష ¬దా ఇస్తే పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

హైదరాబాద్‌ :

తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష ¬దా ఇస్తే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయని, కానీ ప్రభుత్వ పాఠశాలల మాత్రం సమస్యలతోనే విద్యార్థులకు స్వాగతం పలికాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడంతో పేద, మధ్య తరగతి వారు తమ పిల్లలను అప్పులు చేసి ప్రైవేట్‌ స్కూళ్లకు పంపించాల్సి వస్తుందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. ‘చదువుకుందాం’ నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ వస్తే కామన్‌ స్కూల్‌ విధానం తీసుకోస్తానని కేసీఆర్‌ ప్రగల్భాలు పలికాడన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని తెలిపారు. ఫీజుల నియంత్రణ లేదని, కార్పొరేట్‌ విద్యావిధానానికి పెద్ద పీట వేశారని ఆరోపించారు. ఫీజుల కలెక్షన్‌ విషయంలో దేశంలో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 400శాతం ఫీజుపెంపు జరిగిందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు ఐదు శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న రూల్‌ని అతిక్రమించి దాదాపు 70శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలున్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డిటెన్షన్‌ చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుండటం ఆందోళనకరం అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తోన్న పాఠశాలల వివరాలలు తమ దగ్గర ఉన్నాయని.. వారంలోగా వారు సర్దుకోకపోతే.. వాళ్ల పని పడతామని లక్ష్మణ్‌ హెచ్చరించారు. అలయన్స్‌ పార్టీలకు ప్రతిపక్ష ¬దా ఇవ్వాలనుకోవడం సిగ్గు చేటన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here