Featuredజాతీయ వార్తలు

ఇక చాలు.. ముగిద్దాం..

  • అయోధ్య కేసులో తీర్పురిజర్వు
  • మూడు రోజుల్లోపు రాతపూర్వకంగా ఇవ్వండి
  • స్పష్టం చేసిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగొయ్‌
  • విచారణ సమయంలో న్యాయస్థానంలో ఘర్షణ
  • ఆగ్రహం వ్యక్తం చేసిన గగోయ్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. గత 40 రోజులుగా రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కొనసాగుతున్న వాదనలకు బుధవారంతో తెరపడింది. తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. విచారణ సందర్భంగా ఉదయం ఇద్దరు న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈకేసుకు సంబంధించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే మూడు రోజుల్లోపు రాతపూర్వకంగా అందజేయాలని సుప్రీంకోర్టు ఇరువర్గాలకు గడువు విధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత 40 రోజులుగా రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గోగోయ్‌ నవంబర్‌ 17న పదవీ విరమణ చేయనుండగా, అప్పటిలోగా ఈ మైలురాయి కేసులో ధర్మాసనం తన తీర్పును ఇస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే విచారణ సందర్భంగా కోర్టులో గందరగోళ పరిస్థితి నెలకొంది. దశాబ్దాల కాలంగా న్యాయస్థానాల్లో నలుగులునంన అయోధ్య భూ వివాదంపై తుది విచారణ ముగిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అయోధ్య భూ వివాదంతో ముడిపడి ఉన్న అన్ని సంఘాలు, ప్రతినిధులు, న్యాయవాదులు సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. విచారణ ప్రారంభమైన ఉదయం నుంచే రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వాడివేడిగా కొనసాగాయి. విచారణ సమయంలో న్యాయవాదుల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గగోల్‌ ఎదురుగానే ఒకరినొకరు తోసుకున్నారు. సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పదవీ విరణమ చేసిన ఐపిఎస్‌ అధికారి కునాల్‌ కిశోర్‌ అయోధ్య భూ వివాదంపై రాసిన ‘అయోధ్య రీ విజిటెడ్‌ పుస్తకాన్ని చింపివేసేందుకు ప్రయత్నించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. అయోధ్య భూవివాదం కేసు విచారణ సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయోధ్య రివిజిటెడ్‌ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని అంశాలను న్యాయవాది వికాస్‌సింగ్‌ చదవడానికి ప్రయత్నించే సమయంలో సున్నీ వక్ఫ్‌ బోర్డు తరఫున కేసును వాదిస్తున్న న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ పుస్తకాన్ని లాగేసుకుని చింపేయడానికి ప్రయత్నించారు. కొన్ని పేజీలను చింపేశారు కూడా. దాంతో ఇతర న్యాయవాదులు ధవన్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ హైడ్రామాను చూసి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గగోల్‌ తీవ్ర ఆగ్రమాన్ని వ్యక్తం చేశారు. న్యాయవాదుల ప్రవర్తన పట్ల ఆయన అసహయాన్ని వ్యక్తం చేశారు. విూ తీరుమారకపోతే తాను బైకాట్‌ చేస్తానని హెచ్చరించారు.

మసీదు స్థలంపై వెనక్కితగ్గిన సున్నీ వక్ఫ్‌ బోర్డు..

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పడగొట్టడానికి ముందు చారిత్రాత్మక బాబ్రీ మసీదు శతాబ్దాలుగా నిలబడి ఉన్న భూమిపై తన వాదనను సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ విరమించుకుంది. సున్నీ వక్ఫ్‌ బోర్డులో ఉన్న సభ్యుల మధ్య వివాదం చెలరేగడమే దీనికి కారణమని తెలిసింది. వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జేఏ ఫారుకిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయినట్లు తెలుస్తోంది.
వివాదస్పద అంశం నుంచి ఉపసంహరించుకోవాలని వక్ఫ్‌ బోర్డు నిర్ణయించినట్లు మధ్యవర్తి ప్యానెల్‌ సుప్రీంకోర్టుకు తెలిపింది. వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూములను అక్రమంగా అమ్మేశారని ఫారుకిపై యూపీ ప్రభుత్వం విచారణకు ప్రతిపాదించింది. అయితే తనకు ప్రాణహాని ఉందని ఫారుకి కోర్టును కోరడంతో ఆయనకు అదనపు భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశించింది. టైటిల్‌ సూట్‌ నుంచి కేసును ఉపసంహరించాలని నిర్ణయించామని, అయోధ్యలో ఉన్న 22 మసీదుల మెయింటేనెన్స్‌ చూసుకోవాలని వక్ఫ్‌ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close