Featuredరాజకీయ వార్తలు

ఫడణ్‌వీస్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా…

స్నేహితుడిలా మెలుగుతా

కలిసొచ్చి సీఎం అయ్యా, కలిసి పనిచేద్దాం: ఉద్ధవ్‌

ప్రతిపక్ష నేతగా ఎంపికైన దేవేంద్ర ఫడణ్‌వీస్‌ను ప్రతిపక్ష నేతగా పిలువనని, ఓ బాధ్యతాయుత నాయకుడు’ అని తాను పిలుస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. ఇన్నాళ్లుగా తమ మధ్య వున్న బంధం తెగిపోవడానికి బీజేపీయే కారణమని ఆయన ఆరోపించారు. రెండ్రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ”నేను ఫడణ్‌వీస్‌ను ప్రతిపక్ష నేతగా పిలవను. కానీ, బాధ్యతాయుత నేత అని పిలుస్తాను. ఒకవేళ మీరు మాతో సఖ్యతతో వుంటే ఇదంతా జరిగేదే కాదు. దేవేంద్ర ఫడణ్‌వీస్‌ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయనతో ఎప్పటికీ ఓ స్నేహితుడిలా మెలుగుతా” అని ప్రకటించారు.

తానెప్పుడూ తిరిగి వస్తానని చెప్పలేదని, కానీ నేడు ఈ సభకు వచ్చానని అన్నారు. అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి పనులూ చేయనని, కేవలం ప్రజల కోసమే పనిచేస్తానని తాను హామీ ఇస్తున్నానని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. మహారాష్ట్రలోని రైతుల రుణాలను మాఫీ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం కాదని, వారి చింతలను, భయాలను కూడా దూరం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ధవ్‌ స్పష్టం చేశారు. ‘కలిసొచ్చి ముఖ్యమంత్రినయ్యా… మిత్రులుగానే ఉందాం…కలిసి పనిచేద్దాం’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే విపక్ష నేతలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఆదివారంనాడు అసెంబ్లీలో ఆయన తొలిసారి ప్రసంగించారు. విధి, ప్రజల ఆశీర్వాదమే తనను ఇక్కడకు తీసుకువచ్చిందని అన్నారు. ‘మీ (దేవేంద్ర ఫడ్నవిస్‌) నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మిత్రులుగానే కొనసాగుదాం. గత ప్రభుత్వానికి నేనెప్పుడూ వంచించలేదు. అబద్ధాలు ఆడొద్దని, వెన్నుపోటు పొడవవద్దని నా మంత్రులకు సైతం నేను చెబుతుంటాను’ అని ఉద్ధవ్‌ అన్నారు. ‘మిమ్మల్ని నేను విపక్ష పార్టీ నేతగా పిలువను. పెద్ద పార్టీ నేతగానే పిలుస్తాను. తద్వారా మనం రాష్ట్ర సంక్షేమానికి కలిసి పనిచేద్దాం’ అని ఫడ్నవిస్‌ను ఉద్దేశించి ఉద్ధవ్‌ పేర్కొన్నారు. ఇదీ నా హిందుత్వం.. హిందుత్వంపై ఉద్ధవ్‌ మాట్లాడుతూ, తాను ఇప్పటికీ హిందూ ఐడియాలజీకి కట్టుబడి ఉన్నానని అన్నారు. తన ద ష్టిలో హిందుత్వం అంటే అబద్ధాలు చెప్పడం కాదని, ఇచ్చిన మాటకు కట్టుబడటమే తనకు తెలిసిన, తాను ఆచరించే హిందుత్వమని పేర్కొన్నారు. తన హిందుత్వం చెక్కుచెదరలేదని చెప్పారు. గత ఐదేళ్లుగా తాను ప్రభుత్వాన్ని ఎన్నడూ వంచించలేదన్నారు. తాను లక్కీ సీఎంననీ, ఎందుకంటే ఒకప్పుడు తనను వ్యతిరేకించిన వారే ఇప్పుడు మద్దతుగా నిలిచారని అన్నారు. నేను ఎవరితో ఉన్నారో వారు ఇప్పుడు విపక్షం వైపు ఉన్నారని పేర్కొన్నారు. అద ష్టం, ప్రజల ఆశీర్వాదంతోనే తాను ప్రస్తుతం ఇక్కడ (సీఎం పదవిలో) ఉన్నానని అన్నారు. సీఎం అవుతానని కానీ, ఇక్కడికి వస్తానని కానీ తాను ఏరోజూ ఎవరితోనూ అనలేదనీ, విధి తనను ఇక్కడకు తెచ్చిందని పేర్కొన్నారు.

రైతు బాంధవుడు పటోలే : అభినందించిన ఉద్ధవ్‌

ముంబై: మహారాష్ట్ర కొత్త స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్‌ అభ్యర్థి నానా పటోలేకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే అభినందనలు తెలిపారు. స్పీకర్‌ ఎన్నికకు పోటీ నుంచి తమ అభ్యర్థిని బీజేపీ ఉపసంహరించుకోవడంతో ఆదివారం సభ ప్రారంభం కాగానే నానా పటోలే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రోటెం స్పీకర్‌ దిలీప్‌ వాల్సే పాటిల్‌ ప్రకటించారు. దీంతో పటోలేకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే సభలో మాట్లాడుతూ, నానా పటోలే రైతు కుటుంబం నుంచి వచ్చారని, రైతుల సమస్యలు ఆయనకు బాగా తెలుసుసని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఆయన న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంప్రదాయం, విజ్ఞప్తి మేరకే : ఫడ్నవిస్‌ కొత్త స్పీకర్‌గా ఎన్నికైన నానా పటోలేకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అబినందనలు తెలుపుతూ, అసెంబ్లీ స్పీకర్‌ పదవికి కథోరేను తాము నామినేట్‌ చేశామన్నారు. అయితే స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తోందంటూ అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు విజ్ఞప్తి చేయడంతో తాము అంగీకరించామని, తమ అభ్యర్థిని ఉపసంహరించుకున్నామని ఫడ్నవిస్‌ తెలిపారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close