సీఎం చేనేత వస్త్ర రంగానికి ప్రాధాన్యతపై నేతన్నల హర్షం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యవసాయం, సాగు నీటి రంగాలతో పాటు చేనేత రంగానికి కూడా ప్రాధాన్యతను ప్రకటించడం పట్ల సర్వత్రా చేనేత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారని దాసు సురేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా దాసు సురేష్‌ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా కొనసాగుతున్న చేనేత కార్నికుల బలవన్మరణాలను నిర్మూలించడానికి వారికి ప్రత్యేకమైన హెల్ప్లైన్‌ నెంబర్‌ ను ఏర్పాటు చేయడంతో పాటు రుణ సదుపాయం కొరకు కార్పొరేషన్‌లో నిధులను అందుబాటులో ఉంచాలన్నారు. ఇటువంటి దయనీయమయిన పరిస్థితులను అధిగమించడానికి రైతులకు అందిస్తున్నటువంటి 5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్‌ ను ఎన్నికల సమయంలో కేటీఆర్‌ ప్రకటించిన విధంగా చేనేత కార్మికులకు కూడా వెంటనే వర్తింపజేస్తూ 5 లక్షల వరకు హెల్త్‌ కార్డులను కూడ ఉచితంగా మంజూరు చేయాలనీ రాష్ట్ర చేనేత నాయకుడు సురేష్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు..ప్రభుత్వం ప్రకటించిన చేనేత కార్మికుల రుణమాఫీకి నిధులను విడుదల చేసి యార్న్‌ పై ప్రకటించిన నలభై శాతం సబ్సిడీని కూడా వెంటనే విడుదల చేయాలని, పేరుకుపోయిన చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం కొనసాగుతున్న చేనేత కార్మికుల కూలీ రేట్లను కూడా రెండింతలు చేసే విధంగా ప్రభుత్వం తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని, కాకతీయ మెగా టెక్స్టైల్‌ పార్కును కూడా ప్రారంభించి యువతకు, సూరత్‌ భీమండీ, షోలాపూర్‌ ప్రాంతాలనుండి తిరిగివచ్చిన నేతన్నలకు ఉద్యోగ కల్పన చేయాలని వారు సూచించారు. ప్రస్తుత అసెంబ్లీలో చేనేత వర్గం నుండి ఒక్క ఎమ్మెల్యే కూడా లేనందున, చేనేత నాయకత్వం బలపడినప్పుడే వారి సర్వతోముఖాభివృద్ధి జరుగును కావున రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చేనేత నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న 315 మంది సర్పంచులు తిరిగి ఎన్నిక కావడానికి చేనేత వర్గానికి సంబంధించిన వారు అదే రకంగా బీసీ సోదరులంతా వారికి మద్దతు ప్రకటించాలని వారు సూచించారు. చేనేత వర్గానికి సంబంధించిన సర్పంచులు ఉన్నచోట మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల సోదరులు సహకరించే విధంగా అదే రకంగా మిగతా బీసీ., బలహీన వర్గాలు బలంగా ఉన్నటువంటి సర్పంచి స్థానాల్లో చేనేత వర్గాలు సహకరించే విధంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వుమ్మడి ప్రణాళికతో కలిసి పనిచేయాల్సిందిగా వారు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here