Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ఆశల పల్లకిలో నేతలు

ఊరిస్తున్న నామినేటేడ్‌ పదవులు

  • పంద్రాగస్టు తర్వాత కేటాయింపులు
  • పోస్టుల భర్తీకి కేసీఆర్‌ ప్లాన్‌
  • భయాందోళనలో నేతల

హైదరాబాద్‌

గులాబీ దళం ఆశల పల్లకిలో కాలం గడుపుతుంది. నామినెటేడ్‌ పదవులు లేక పార్టీ పదవులు రాక నేతలంతా అధినాయకుల చుట్టూ చక్కర్లు కొడుతూ కనిపించినప్పుడల్లా దండాలు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యమ సమయంలో జెండా పట్టి కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేతలతో పాటు పదవుల కోసం అధికార పార్టీలోకి జంప్‌ కొట్టిన నేతలు సైతం అధినేత కరుణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్‌ పదవులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా పార్లమెంట్‌, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు వరుసగా రావడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం ఉత్తమమని ఆధినేత కేసీఆర్‌ భావించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. కేవలం మున్సిపల్‌ ఎన్నికలు మాత్రమే ఉండడంతో దశల వారీగా నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన సర్పంచ్‌, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో రిజర్వేషన్లు అనుకూలించక పోవడం, పోటీ తీవ్రత దృష్టా బరిలో నిలబడకుండా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన వారంతా నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. నామినేటేడ్‌ పోస్టులను ఆగష్టు 15వ తేదీ తర్వాత భర్తీ చేయాలని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ భావిస్తున్నారు. అయితే ఈ పదవులు తమకు దక్కుతాయో లేదోననే భయం పార్టీలో చాలా కాలంగా ఉన్న నేతలను పట్టిపీడీస్తోంది. ఇతర పార్టీల నుండి టీఆర్‌ఎస్‌ లో చేరిన నేతలు నామినేటేడ్‌ పదవులను ఎగురేసుకుపోతారనే ఆందోళన చోటు చేసుకొంది. మొదటి నుండి పార్టీలో ఉన్నవారికే నామినేటేడ్‌ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్‌ ఇటీవలి కాలంలో హావిూ ఇచ్చారు. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు వంటి అంశాల్ల్లో పార్టీలో మొదటి నుండి ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చినవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టును నేతకాని వెంకటేష్‌ కు కేసీఆర్‌ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో జరిగిన ఎన్నికల్లో వెంకటేష్‌ చెన్నూరు నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. పార్లమెంట్‌ ఎన్నికల సమయానికి ఆయన టీఆర్‌ఎస్‌ లో చేరారు. టీఆర్‌ఎస్‌ లో చేరిన వెంటనే ఆయనకు పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టును కేటాయించారు. వెంకటేష్‌ టీఆర్‌ఎస్‌ లో చేరేలా మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కీలకంగా వ్యవహరించారని చెబుతారు. వెంకటేష్‌ టీఆర్‌ఎస్‌ లో చేరడంతో వివేక్‌ కు టీఆర్‌ఎస్‌ లో టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. వరంగల్‌ రూరల్‌ జడ్పీ ఛైర్మెన్‌ స్థానాన్ని గండ్ర జ్యోతికి టీఆర్‌ఎస్‌ కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుండి గండ్ర జ్యోతి భర్త గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ నుండి పోటీ చేసి విజయం సాధించాడు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ ను వీడి టీఆర్‌ఎస్‌ లో చేరారు. భూపాలపల్లి జడ్పీ ఛైర్మెన్‌ పదవి ఎస్సీలకు రిజర్వ్‌ అయింది. దీంతో వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ పదవికి గండ్ర జ్యొతికి ఇచ్చారు. కాంగ్రెస్‌ నుండి టీఆర్‌ఎస్‌ లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి కూడ కేబినెట్‌ బెర్త్‌ కేటాయిస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. లోక్‌ సభ ఎన్నికల ముందు సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌ లో చేరారు. సబితా ఇంద్రారెడ్డికి ¬ం మంత్రిత్వశాఖను కేటాయిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close