దీక్ష విరమించిన లక్ష్మణ్‌..!

0

  • లక్ష్మణ్‌తో దీక్ష విరమింపజేసిన కేంద్ర మంత్రి హన్సరాజ్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేశారు. దీనిలో భాగంగా గత సోమవారంప్రభుత్వం తీరును నిరసిస్తూ, ఇంటర్మీడియట్‌ బోర్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరవదిక నిరాహార దీక్షకు దిగారు. దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను అదేరోజు అరెస్ట్‌ చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. సోమవారం నుంచి నేటివరకు దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా శుక్రవారం నిమ్స్‌లో ఉన్న లక్ష్మణ్‌ను కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌తో దీక్ష విరమింపజేశారు.

లక్ష్మణ్‌ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి కృష్ణదాస్‌, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు. ఇదిలాఉంటే లక్ష్మణ్‌తో అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడి దీక్ష విరమింపజేయాలని సూచించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అండగా ఉంటామని అమిత్‌ షా హామీ ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తామని భరోసా ఇచ్చారు. 119 నియోజకవర్గాల్లో దీక్షలుచేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీజేపీ నేత మురళీధరరావు అన్నారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ¬ంమంత్రిని కలుస్తామన్నారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమని బీజేపీ సీనియర్‌ నేత హన్సరాజ్‌ గంగారాం అన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని కేంద్రం తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రిని, ఇంటర్‌బోర్డు కార్యదర్శిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here