Featuredస్టేట్ న్యూస్

మండలాల్లో… ధర్మపీఠం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

కొన్ని విషయాలను మాట్లాడాలంటే చాలామందికి బెరుకు. భయం. పైకిమాత్రం మేకపోతు గాంభీర్యం. బాధితులకు న్యాయం సకాలంలో అందకపోతే అది అన్యాయం చేసినట్లే. ఇది చెప్పటానికి ఉండాల్సింది పిడికెడు గుండె ధైర్యం మాత్రమే. గ్రావిూణులు గతంలో రచ్చబండల వద్ద సత్వర న్యాయం చేసుకునేవారు. నేటికీ సుప్రీంకోర్టు ఈ రచ్చబండ తీర్పులకే విలువిస్తుంది. అందుకే న్యాయధికారులు ఎట్టకేలకు

మండలస్థాయిలో చిన్న తరహా తప్పులకు, నేరాలకు అక్కడే సత్వర న్యాయం జరిగే విధంగా ఆర్థిక శాఖ కసరత్తులు పూర్తి చేసింది. ఆ దిశలోనే మండలస్థాయిలో న్యాయస్థానాల ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. దీంతో వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం అందే అవకాశాలు మెరుగుపడతాయి.

2009లో అంకురార్పణ:

మండల కేంద్రాల్లో న్యాయస్థానాలు

చిన్న కేసులను గ్రామస్థాయిలోనే విచారించేందుకు 2009 అక్టోబర్‌ 2 గ్రావిూణ న్యాయాలయాల చట్టాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాల్లో అమలుకు సన్నద్ధం కాగా.. 11 రాష్ట్రాలు మాత్రమే నోటిఫై చేశాయి. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. అప్పటి ప్రభుత్వం పల్లె న్యాయస్థానాలు పేరుతో పంచాయతీల్లో కోర్టుల ఏర్పాటుకు సిద్ధమైంది. ఒక సీనియర్‌ న్యాయవాది లేదా న్యాయశాఖలో విశ్రాంత సూపరింటెండెంట్‌ స్థాయి ఉద్యోగి లేదా విశ్రాంత జడ్జిలను న్యాయాధికారిగా నియమించాలని తలచింది. న్యాయస్థానంలో స్థానిక రెవెన్యూ అధికారి, సర్పంచి, సామాజిక కార్యకర్తలను సభ్యులుగా నియమించి.. న్యాయమూర్తికి సాయంగా ఉండేలా ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రతిపాదనలు మూలకు చేరాయి. ఈ అంశంపై ఇటీవల దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించడంతో ఈ ప్రతిపాదన తెరపైకొచ్చింది. అప్పటి ప్రతిపాదనల్లో స్వల్పమార్పులు చేసి మండల కేంద్రాల్లో న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని తలచినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. ప్రతిపాదనలు వెంటనే అమలు చేయాలని ఆర్థిక శాఖను కూడా ఆదేశించింది.

ఇలా ఉంది:

జిల్లా కేంద్రాలలో ఉన్న న్యాయస్థానాల పరిధిలో లక్షలాది కేసులు విచారణలో ఉన్నాయి. వీటన్నింటిని విచారించడానికి దాదాపు ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని న్యాయ నిపుణులే చెబుతున్నారు. వాటిల్లో 42 శాతం కేసులు తక్కువ నేర తీవ్రత ఉన్నవే ఉండటం గమనార్హం. గ్రావిూణ మండలాలకు చెందిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో వాదప్రతివాదులుగా ఉన్న లక్షలమంది కక్షిదారులు నెలకు కనీసం రెండుసార్లు చొప్పున కోర్టుల వాయిదాలకు హాజరవుతున్నారు. ఫలితంగా వారికి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఇలా చేస్తే..:

నేరాలను వీలైనంత త్వరగా విచారించి శిక్షలు ఖరారు చేస్తే వారికి అనేక ఇబ్బందులు తొలగుతాయి. ప్రస్తుతం ఆ దిశగా ప్రభుత్వం, హైకోర్టులు అడుగులు వేస్తున్నాయి. సమాజంలో పెరుగుతున్న నేరప్రవృత్తి కారణంగా పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న కేసులు ప్రతిఏటా పెరిగిపోతున్నాయి. అందుతున్న ఫిర్యాదుల్లో 30 నుంచి 50 శాతం కేసులు నేర తీవ్రత తక్కువున్న స్వల్ప వివాదాలు, భూవివాదాలు, ఆయుధ రహిత దాడి తరహావే అధికంగా ఉంటాయని న్యాయనిపుణుల అంచనా. ఈస్థాయి నేరాలు నిరూపితమైతే జరిమానా లేదా.. గరిష్ఠంగా రెండేళ్లపాటు సాధారణ జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత.. ఉన్న వారిపై పనిభారం వల్ల ఇలాంటి కేసుల విచారణలో జాప్యం జరుగుతోంది. దీనిని పరిశీలించి చిన్న, చిన్న వివాదాలను గ్రామస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కొత్త విధానానికి తెర తీసింది. మండల కేంద్రాల్లో న్యాయస్థానాలను ఏర్పాటుచేసి కేసులు విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఫలితంగా గ్రామాల్లోని బాధితులకు మేలు జరగడమే కాక.. జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో పనిచేసే న్యాయమూర్తులపై పనిభారం తగ్గనుంది.

నల్గొండ, కరీంనగర్‌ లలో అధికం..:

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు వేగంగా అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టుల ఏర్పాటుకు నిధులు సైతం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 8 ఉమ్మడి జిల్లాల్లో మండల న్యాయవ్యవస్థ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నల్గొండతోపాటు కరీంనగర్లో మాత్రమే 15 న్యాయస్థానాలు రానున్నాయి. త్వరలో మిగిలిన ఉమ్మడి జిల్లాలకు న్యాయ సేవలు విస్తరించనున్నాయి.

I ఒక్కో న్యాయస్థానానికి రూ.18 లక్షల చొప్పున రూ.2.70 కోట్లను ఏకమొత్తంగా అందజేస్తారు. వీటితో సొంత భవనం, ఫర్నీచర్‌, కంప్యూటర్లు సమకూరుస్తారు. మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున మంజూరు చేస్తారు.

I న్యాయస్థానంలో రెగ్యులర్‌ న్యాయమూర్తితోపాటు మరో నలుగురు సిబ్బందిని నియమిస్తారు. సహాయ సిబ్బంది ఒప్పంద పద్ధతిపై తీసుకునేందుకు కసరత్తు జరుగుతోంది. వీరి జీతభత్యాలకు ఏడాదికి రూ. ఒక్కో కోర్టుకు రూ.18 లక్షలు, మౌలిక వసతులకు మరో రూ.5 లక్షలు అందిచంనున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close