Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

మీ ప్రభుత్వానికి నేడే ఆఖరి రోజు..

కుమార స్వామి..సిద్ధంగా ఉండండి’

  • ముఖ్యమంత్రిపై భాజపా నేత యడ్యూరప్ప విసుర్లు
  • కుమారస్వామికి బుద్ది చెబుతాం: రెబెల్‌ ఎమ్మెల్యేలు

బెంగళూరు:

కన్నడ నాట రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. కుమారస్వామి ప్రభుత్వానికి తాము బుద్ది చెబుతామని రెబెల్‌ ఎమ్మెల్యేలు ప్రకటించారు. సోమవారం నాడు అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కోనున్నారు. గురువారమే బలపరీక్ష జరగాల్సి ఉండగా..అది సోమవారినికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో స్థానిక రమద ¬టల్‌ వద్ద భాజపా నేత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఎవరి బలం ఏంటో సోమవారం తేలిపోతుందన్నారు. ‘రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలను బలపరీక్షకు రావాలని బలవంతం చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ విషయంలో వారికి స్వేచ్ఛనిస్తున్నట్లు కూడా చెప్పింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ జారీ చేసిన విప్‌లకు విలువ లేదు. ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా కుమారస్వామి వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌ మాటలను ఆయన పట్టించుకోవడం లేదు. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌, ముఖ్యమంత్రి కుమార స్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య రేపటి అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. వీటన్నింటికీ సమాధానం రేపు అసెంబ్లీలో దొరుకుతుంది. రేపే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు’ అని యడ్యూరప్ప అన్నారు.

కుమారస్వామికి బుద్ది చెబుతాం: రెబెల్‌ ఎమ్మెల్యేలు

కుమారస్వామి ప్రభుత్వానికి పాఠం చెప్పేందుకే తాము ముంబైకి వచ్చినట్టుగా రెబెల్‌ ఎమ్మెల్యేలు ప్రకటించారు.తాము ముంబైకి డబ్బుల కోసం రాలేదన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకే వచ్చామన్నారు. అన్ని పరిష్కారమయ్యాకే తాము బెంగుళూరుకు వెళ్తామని ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇప్పటికే మూడు దఫాలు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్‌ వాజ్‌భాయ్‌ వాలా సీఎం కుమారస్వామిని ఆదేశించారు. అయితే విశ్వాస పరీక్షపై చర్చ పూర్తి కాకుండా విశ్వాస పరీక్షను పూర్తి చేయలేమని స్పీకర్‌ ప్రకటించారు. సోమవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించారు. ఒకవేళ సోమవారం నాడు విశ్వాసపరీక్షను పూర్తి చేసుకోకపోతే కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని రెబెల్‌ ఎమ్మెల్యేలు ప్రకటించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని సీఎం కుమారస్వామి ఆరోపించారు. ప్రభుత్వం మైనార్టీలో పడినందున గద్దె దిగాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close