అయోధ్య భూమి సమస్యకాదు

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అయోధ్యలోని రామ మందిర నిర్మాణం ఓ రెండు మూడెకరాలు సమస్యల కాదు. రామాలయ నిర్మాణం అన్నది భారతీయ సాంస్కృతికి వారసత్వం. అక్కడే ఎందుకు ఆలయం నిర్మించాలన్న పట్టుదలే ఇక్కడ ముఖ్యం. మనం దీనిపైనే చర్చించుకోవాలి. ఇక్కడ ఉన్న పురాతనమైన, మన ఆరాధ్యమైన రామాలయాన్ని బాబర్‌ కాలంలో కూల్చేసి మసీదు కట్టారన్న భావన ప్రజల్లో ఉండిపోయింది. దానిని తొలగించుకుని అంతా కలసికట్టుగా ముందుకు సాగాల్సి ఉంది. అయోధ్య స్థలంపై యాజమాన్య హక్కును ధ్రువీకరించే టైటిల్‌ వివాదం కాదిది. రామజన్మభూమిలో రాముడి మందిరం మాత్రమే ఉండాలి. రాముడు పుట్టిన ప్రదేశాన్ని మార్చలేము. అలాంటి చోట్లనే ఎందుకు వివాదాలు చెలరేగాయో చరిత్ర చదివితే తెలుస్తుంది. అయితే సుప్రీంలో దీనిపై ఏళ్లుగా విచారణలు చేస్తూ ఇదేదో స్థల సమస్యలాగా దీనిని చిత్రీకరించి కాలయాపన చేయడం సరికాదు. లైకికవాదులుగా చెప్పుకుంటున్న వారు సమస్య జటిలం కాకుండా వ్యవహరించాలి. బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కావద్దని కోరుకుంటున్న వారు ఈ దేశంలో అత్యధికులు ఆరాధించే రాముడిని అవమానించడమే. నాడు అయోధ్యలో రామాలయాన్ని కూల్చి రాముడిని అవమానించిన బాబర్‌ మసీదు కట్టి వివాదానికి కారకుడైతే కొందరు ఇంకా ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని చూస్తున్న తీరు అత్యంత దారుణం కాక మరోటి కాదు. అయోధ్య అన్నది పవిత్రమైన రాముని జన్మస్థలం. దీనికి నిజంగా ఎవరో పర్మిషన్‌ తీసుకుని గుడి కట్టాల్సిన అసవరం లేదు. మక్కాకో, జెరూసలెమో వెళ్లి గుడి కడతామంటే నవ్వుతారు. అలాగే అయోధ్య కూడా అంతే. అయోధ్య, మధుర, వారణాసి ఈ దేశ ప్రజల జీవనాడులు. సాంస్కృతిక వారసత్వాలు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అన్నది హిందువుల మనోభావంగా గుర్తించాలి. ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా మదీనా, కైస్త్రవులు పవిత్రంగా భావించే జెరూసలెం, వాటికన్‌ సిటీలాగా అయోధ్య, కాశీ, మధురలు హిందువులకు పవిత్ర క్షేత్రాలు. దీనిని గుర్తించడానికి లౌకివాదాలు అక్కర్లేదు. అయోధ్యపై ఎవరు కూడా అతిగా మాట్లాడి సమ్యను రాజేయవద్దు. సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్న వేళ గతాన్ని తవ్వ పుండును కెలకడం మంచిది కాదు. సుదీర్ఘంగా చర్చలు జరిపిన అఖిల భారతీయ అఖాడా పరిషత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ షియా వక్ఫ్‌ బోర్డులు దీనిపై సామరస్య

పూర్వకంగా ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ విషయాన్ని ఇరు పక్షాల నేతలు గతంలోనే ప్రకటించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుంది. ఒప్పందం కుదిరిందని, షరతులు, నిబంధనలను ఖరారు చేసే పనిలో ఉన్నామని ఇరువర్గాలు సుప్రీంకు తెలిపారు. చాలామంది ఇప్పటికీ అయోధ్యను మందిర నిర్మాణ సమస్య గానే చూస్తున్నారు. అయోధ్య కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడివున్న అంశం. ఇక్కడ రామాలయం ఉండకుండా బాబ్రీ మసీదు ఎలా వచ్చిందో విమర్శకులు చరిత్ర చదివి తెలుసుకోవాలి. ఇలా అయోధ్య, వారణాసి, కాశీలల్లో మన ఆలయాలను నాటి దురాక్రమణ దారులు కూల్చి మసీదులు కట్టారు. వేలాది గుళ్లూ గోపురాలను కూల్చారు. వీటన్నికి చరిత్ర సాక్షీభూతంగా ఉంది. అయితే గతాన్ని మరచి ఓ సయోధ్య దిశగా సుప్రీం చేసిన సూచనలు కుహనా లౌకికివాదులకు స్ఫూర్తి కావాలి. ఈ దేశంలో వేలాదిగా మసీదులు ఉన్నా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడంలేదు. కాబట్టి హిందువుల పవిత్ర మత ప్రాంతాల్లో దురాక్రమణ దారులు దాడుల కారణంగా ధ్వసం అయిన క్షేత్రాలను పునరుద్దరించుకోవాల్సిందే. ఇలా చేస్తేనే కోట్లాది హిందువుల గౌరవాన్నికాపాడిన వారు అవుతారు. హిందువుల మనోభావాలను గెలిచిన వారు అవుతారు. అయోధ్యలో ఓ రెండు మూడెకరాల స్థల సమస్య అస్సలు కాదన్నది గుర్తుంచుకోవాలి. సున్నితమైన అయోధ్య మందిర వివాదానికి కోర్టు వెలుపల ఒక పరిష్కారాన్ని

అన్వేషించడానికి సంబంధిత పక్షాలన్నీ చేస్తున్న ప్రయత్నాలతో ఈ దేశంలో శాంతికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. వివాదాలను కొనసాగించకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మతపరమైన విషయాలను చర్చల ద్వారానే చక్కగా పరిష్కరించు కోవచ్చని గతంలోసే నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వివాదాన్ని అర్థవంతంగా, చిత్తశుద్ధితో పరిష్కరించుకోవచ్చని తెలిపింది. చరిత్రలో కొందరు చేసిన పైశాచిక దాడులకు తాము వారసులం కామని నిరూపించు కోవాలి. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో మోదీ సర్కారు ఉంది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగింట మూడొంతుల ఆధిక్యంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడా, ఇక్కడా సానుకూల వాతావరణం ఉన్న దశలో సుప్రీంలో ఇలాంటి కీలక సమయంలో అయోధ్య సమస్య పరిష్కారం దిశగా ఒక అడుగు ముందుకు పడడం అన్నది సానుకూలంగా మలచు కోవాలి. అందువల్ల ఇకనైనా హిందువుల మనోభావాలను గుర్తెరిగి మసలుకుంటే మంచిది. దీనిని ఎన్‌ఇనకల అంశంగా చూడకుండా బిజెపి సమస్య పరిస్కార దిశగా కృషి చేయాలి. అప్పుడే మనకు సానుకూలత వస్తుంది. అందుకు అవసరమైతే అన్ని పక్షాలతో చర్చించాలి. అంతేగాని నీ వైఖరేంటన్న ధోరణి సరికాదు. ఈ సమస్యకు ఎంతత్వరగా పరిష్కారం దక్‌ఇకతే అంతమంచిది. రాహుల్‌ తన అభిప్రాయం చెప్పాలంటూ రాజకీయ ప్రకటనలు చేయడం అమిత్‌ షా లాంటి వారికి తగదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here