Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

లలితా జువెలర్స్ ఎండి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు.

  • సికిందరాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పాట్ మార్కెట్ స్వర్ణకార సంఘం.

పాట్ మార్కెట్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఇందిరాల రాజు మరియు జనరల్ సెక్రెటరీ రుద్రవరం శేఖర్ ఆధ్వర్యంలో లలితా జువెలర్స్ ఎండీ కిరణ్ పై కేసు నమోదైంది. “ఈ టీవీ” ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వర్ణకారులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు గాను ఈ కేసులు నమోదయ్యాయి. స్వర్ణకారులు భార్యకు చేసే నగల పైనే కాదు తల్లికి తయారు చేయబడే నగల పైనా కూడా దోచుకుంటారని అతను అనడం దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.


తల్లి గాజులు దొంగతనం చేసిన వ్యక్తి మరియు శశికళ బినామీ?:

చిన్నతనంలో తల్లి గాజులు దొంగతనం చేసి ఇంట్లో నుంచి పారిపోయిన వ్యక్తి, విశ్వకర్మలను అవహేళన చేస్తూ మాట్లాడటం విడ్డూరమని స్వర్ణకారులు ఆగ్రహించారు. విశ్వకర్మలు తయారు చేస్తున్న ఆభరణాలతో పైకి వచ్చిన కిరణ్ ఆ విశ్వకర్మలను దూషించడం సహించరాని నేరమని పాట్ మార్కెట్ స్వర్ణకార సభ్యులు వాపోయారు. తమను కించపరిచే ముందు ఒకసారి తన గతం గుర్తు చేసుకోవాలని ప్రజలు అభిప్రాయపడ్డారు. కిరణ్ సంపాదించిన ఆస్తి అంతా సొంత కష్టార్జితం కాదని తమిళనాడుకు చెందిన శశికళ యొక్క బినామీయే ఈ కిరణ్ అని ప్రజల్లో ఉన్న అపోహలకు తాను సమాధానం చెప్పాలని అన్నారు .

**
ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి సైతం :

ఈ తతంగం అంతటికీ ముఖ్యమైన మూల కారణం – ” ఈనాడు టీవీ చానల్ “లో కిరణ్ ని ఇంటర్వ్యూ చేసిన వ్యాఖ్యాత .
తమ కుటుంబ సభ్యులకు చేస్తున్నటువంటి ఆభరణాలలో కూడా బంగారం దొంగతనం చేసే నైజం స్వర్ణకారుల లో ఇంకా కొనసాగుతున్నదా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు కిరణ్ “అవును” అని నవ్వుతూ సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖాముఖి కార్యక్రమంలో పాటించాల్సిన కనీస గౌరవ మర్యాదలు మరియు పదజాలం తెలియని ఆ టీవీ వ్యాఖ్యాత పై కఠిన చర్యలు తీసుకోవాలని స్వర్ణకారులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసారం చేసిన ఈనాడు చానెల్ యాజమాన్యం, ఇంటర్వ్యూ చేసిన వ్యాఖ్యాత మరియు కిరణ్ తక్షణమే చానెల్ లో క్షమాపణ చెప్పాలని స్వర్ణకారులు డిమాండ్ చేశారు .


తదుపరి చర్యలు తీసుకుంటాం: శంకర్ యాదవ్,
మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ .

పార్ట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు ఇందిరాల రాజు మరియు జనరల్ సెక్రెటరీ రుద్రవరం శేఖర్ ఆధ్వర్యంలో స్వర్ణకారులందరూ వచ్చి లలిత
జువెలర్స్ ఎండీ కిరణ్ పై
కంప్లయింట్ ఇచ్చారు. ఏసిపి తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని శంకర్ యాదవ్ చెప్పారు. కార్యక్రమంలో భవనం చైర్మన్ పానుగంటి విష్ణు మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు .

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close