గెలుపు కూటమిదే..!!

0

(పరమాత్మ, ఆదాబ్‌ హైదరాబాద్‌) తెలంగాణ ఎన్నికలపై ఇంటలిజెన్స్‌ సర్వే చేసిన ఒక్కసారిగా గుప్పుమంది. తెలంగాణ ఎన్నికల సమరంలో ప్రచార పర్వానికి మరి కొద్ది గంటల్లో తెర పడనుంది. ఇప్పటి వరకు ఏ పార్టీ ఎలా ప్రచారం చేసిందన్న దానిపై చర్చలు జరగుతు న్నాయి. తాజాగా… ఇక ఏ పార్టీ గెలవబోతు న్నది? ఏ అభ్యర్థి గెలుస్తాడు? ఎవరి బలాలేంటి? ఎవరి బలహీనతలు ఏంటి? అన్నదానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇక సర్వేల హడావిడి కూడా మామూలుగా లేదు. తెరాస పార్టీ సర్వేలన్నీ ఆ పార్టీకి వంద సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెబుతున్నది. కూటమిదే అధికారం అని కాంగ్రెస్‌, టిడిపి పార్టీలు చేసిన సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం వారు చేసిన తాజా సర్వే వివరాలు బయటకొచ్చా యి. తెలంగాణకు చెంది న సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ అధికార వర్గాలు చేసిన సర్వే వివరాలను కేంద్రానికి సమర్పిం చాయి. ఆ సర్వే నివేదికలను ఆంధ్రప్రదేశ్‌ ఇంటె లిజెన్స్‌ అధికారులు సేకరించారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఉన్న రాజకీయ పరిస్థితి మీద సర్వే చేస్తున్న ఎపి ఇంటలిజెన్స్‌ వర్గాలు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ నివేదికను కూడా బేరీజు వేస్తున్నా యి. కేంద్ర ఇంటిలిజెన్స్‌ వర్గాలు తెలంగాణ ఎన్నికల మీద చేసిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలు స్తాడో సర్వే వివరించింది. మొత్తం 11 పేజీల సర్వే నివేదికలో జిల్లాల వారీగా 119 నియోజ కవర్గాలకు సంబంధిం చిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా: కాంగ్రెస్‌ 58 స్థానాలలో తెరాస 29 తెలుగుదేశం 9, మజ్లీస్‌ 6, బిజెపి 2 స్థానాలలో గెలుస్తాయని ఈ నివేదిక వెల్లడించింది. 15 సీట్లలో ఉత్కంఠభరిత పోరు ఉంటుందని తెలిపింది. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా (10 సీట్లు) : కాంగ్రెస్‌ 8 సీట్లు, తెరాస 1 సీటు, మరో స్థానంలో పోటాపోటీ ఉంటుంది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా (9 సీట్లు) : కాంగ్రెస్‌ 4, తెరాస 4, మరో స్థానం ఉత్కంఠ భరితం. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా (13 సీట్లు) : కాంగ్రెస్‌ 7, తెరాస 3, కిగా 3స్థానాలలో ఉత్కంఠ భరితం. మెదక్‌ ఉమ్మడి జిల్లా (10 సీట్లు) : కాంగ్రెస్‌ 4, తెరాస 6. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా (14 సీట్లు) : కాంగ్రెస్‌ 7 సీట్లు, తెరాస 2, తెదేపా 4 సీట్లు, మరో స్థానంలో హోరాహోరి. హైదరాబాద్‌ జిల్లా (15 సీట్లు) : కాంగ్రెస్‌ 2 , తెరాస 2, ఎంఐఎం 6, బిజెపి 2 సీట్లు కైవసం చేసుకుంటాయి. మరో మూడు సీట్లలో తీవ్ర పోటీ ఉంటుంది. మహబూబ్‌ నగర్‌ ఉమ్మడి జిల్లా (14 సీట్లు) : కాంగ్రెస్‌ 6, తెరాస 3, తెదేపా 2, మరో 3 సీట్లలో ఉత్కంఠ భరితం. నల్లగొండ ఉమ్మడి జిల్లా (12 సీట్లు) : కాంగ్రెస్‌ 8, తెరాస 4 వరంగల్‌ ఉమ్మడి జిల్లా (12 సీట్లు) : కాంగ్రెస్‌ 6, తెరాస 3, మరో 3 స్థానాలలో ఉత్కంఠ భరితం. ఖమ్మం ఉమ్మడి జిల్లా (10 సీట్లు ) : కాంగ్రెస్‌ 6, తెరాస1 సీటుకే పరిమితం కాగా, 3 స్థానాలలో తెదేపా గెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here