కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌కు షాక్‌..

0

చేస్తూ.. కేసీఆర్‌కు లేఖ పంపారు. ఈ లేఖలో కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు పద్మారావు. పార్టీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ‘పార్టీని ఇల్లులా.. కేసీఆర్‌ను ఇంటి పెద్దదిక్కులా భావించాను. పార్టీలో ఇన్నాళ్లు చాలా మందికి అన్యాయం జరిగినా ఓపికతో సహించాను. ఇకనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించి ఎదురు చూశాను. అయినా.. ఎటువంటి మార్పులేదు. తెలంగాణ వాదం అనే పదాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. మీలో మార్పు రాకపోగా.. పార్టీ పక్కదారుల పడుతోంది. ఇక పార్టీ గాడిలో పడదని భావించి పార్టీకి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పదవికి రాజీనామా చేస్తున్నా’అని లేఖలో పేర్కొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలకమైన కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నేత రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి రాజీనామా చేసినా.. తన భవిష్యత్‌ కార్యాచరణ గురించి మాత్రం పద్మారావు స్పందించలేదు. ఏదైనా పార్టీలో చేరతారా.. రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here