Featuredరాజకీయ వార్తలు

మాట తప్పిన మంత్రి కేటీఆర్‌

చేనేతల నెత్తిన శఠగోపం..

హమీలే తప్ప అమలు లేవు..

ఆవేదన వ్యక్తం చేస్తున్న నేతన్నలు..

ఓట్లు వేయండి.. అధికారంలోకి రాగానే చేనేతల తలరాతలు మార్చుతాను అని ఘంటాపథంగా హమీల వర్షం కురిపించినా కెటిఆర్‌ ఇప్పుడు నేతన్నల బతుకులను పట్టించుకోవడమే మానేశారు. ప్రభుత్వం నుంచి కనీస సహాయం లేక, సమస్యలతో ఆయన వస్తే స్పందించడమే లేదు. ఓట్ల వరకు అమలు కాని హమీలను కురిపించిన కెటిఆర్‌, రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం దగ్గరికి వస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క హమీని కూడా నేరవేర్చని ఘనత ఆయనకే సాధ్యమయింది..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి) : మన రాష్ట్రం మనకొస్తుంది. కష్టాలు, కన్నీళ్లు ఇంక కనబడవని, ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక బంగారు పళ్లెంలో భోజనాలు పెడుతామన్న రీతిలో వాగ్దానాలు కురిపించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ మాటలు మాటలుగానే మిగిలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని ఆరు సంవత్సరాలు దాటుతున్నా చేనేతల ఆత్మహత్యలు మాత్రం ఆగడమే లేదు. తెలంగాణ ప్రభుత్వాధినేత కెసిఆర్‌ విద్యార్థి జీవితమంతా చేనేతల ఇళ్లలోనే కొనసాగిందని చెప్పిన కెటిఆర్‌ అదే చేనేతలకు ప్రోత్సాహం కల్పించడంలో మాత్రం విఫలం చెందారు. కెటిఆర్‌ గెలుపొందాక సిరిసిల్లలోని పవర్‌లూమ్‌ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్యర్వంలో కృతజ్ఞతా సభలో చేనేతల తలరాతలు మార్చేవిధంగా ప్రసంగించారు. చేనేతల కుటుంబాల్లో పుట్టకపోయినా, వారి కుటుంబసభ్యుల్లో ఒకరిగా ఉంటూ చేనేతల బతుకుల్లో వెలుగులు నింపుతానని ప్రకటించారు. ఏ హమీని నెరవేరక ఇప్పటికి ఆత్మహత్యలే దిక్కుగా బ్రతకడం చేనేతలకు అలవాటుగా మారిపోయింది. నేతన్నలు కార్మికులు కాదని వారు కళాకారులని అభివర్ణించిన మంత్రి కెటిఆర్‌ బతుకమ్మ చీరలతో తెలంగాణకు గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు నేతన్నలను ఓట్ల బ్యాంకుగానే చూస్తున్నారు కాని వారి జీవితాలను పట్టించుకోకపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రమంత్రి కేటీఆర్‌ నేడు మిల్లు మాఫియాతో మిలాఖత్‌ అయి చేనేత బ్రతుకుల్లో విషం నింపుతున్నారని నేతన్నలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చేనేతల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని యాచించకుండా శాసించి సాధిద్దామని చెప్పిన మంత్రి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ తమ బ్రతుకులు మగ్గం కిందనే నలిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత వస్త్రాల పేరుతో మిల్లు లో తయారైన వస్త్రాలను భారీ స్థాయిలో అమ్ముతున్న తెలంగాణ ప్రభుత్వం వాటిని నిరోధించి తగు చర్యలు తీసుకోవడానికి చొరవ చూపకపోవడం పట్ల విచారం వ్యక్తపరిచారు. రెండవసారి మంత్రిగా చేనేత జౌళి శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి చేనేత బతుకుల్లో వెలుగులు నింపేందుకు మిల్లు వస్త్రాలను చేనేత వస్త్రాలుగా నమ్మించి నేతన్నల పొట్టగొడుతున్న మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు ముందుకు రాకపోవడంపై నేతన్నలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

రెబ్బ సూర్యకళా

చేనేత కార్మికురాలు, ఎల్బీ నగర్‌ :

ఫ్యాక్టరీలలో తయారయ్యే వస్త్రాలను చేనేత వస్త్రాలుగా విక్రయిస్తూ షాపింగ్‌ మాల్‌లు చేస్తున్న అక్రమాలను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఎంతో కష్టపడి, ఒడిదొడుకులనెదుర్కొని తాము నేసె చేనేత వస్త్రాలకు ఇమిటేషన్‌ వస్త్రాలను పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్‌లు మార్కెట్లో అమ్ముతూ వినియో గదారులను మోసంచేస్తూ చేనేతల వృత్తిని పూర్తిగా నిర్వీర్యం చేసే దుశ్చర్యలకు పాలపడుతు న్నారు.. చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినా కనీసం వారిని పరామ ర్శించే పరిస్థితిలో వస్త్రాలయాలు లేవని , వ్యాసరస్థులు చేనేత వస్త్రాలుగా చెబుతున్న వస్త్రాలు నకిలీవి కాబట్టే చేనేత కార్మికులు మరణించినా, తీవ్ర ఇబ్బందుల నెదుర్కుంటున్నా వ్యాపారస్తులు చలించడంలేదు.

అంకం మురళి :

చేనేత కార్మికుడుచేనేత కళకు సంబంధించిన రిజర్వేషన్‌ యాక్టు నియమాలను అధికారులు తుంగలో తొక్కడం వలనే వ్యాపారస్తులు విచ్చలవిడిగా పక్క రాష్ట్రాలనుండి ఫ్యాక్టరీ వస్త్రాలను దిగుమతిచేసుకుంటూ లాభాల కోసమే షాపింగ్‌ మాల్లను నిర్వహిస్తున్నారు .. చేనేత పరిరక్షణకు రాజ్యంగంలో నియమాలున్నా వాటిని పట్టించుకోకపోవడం వల్లనే తాము నేసె చేనేత వస్త్రాలు డూప్లికేట్‌ సిల్క్‌ వస్త్రాలతో దరల విషయంలో పోటీపడలేక గిట్టుబాటు గాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము ..అధికారుల నిర్లక్ష్యమే అసలైన చేనేతకార్మికుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి .. నకిలీ చేనేత వస్త్రాలను మార్కెట్‌ నుండి ఏరివేయాలి .. చేనేత వృత్తిని కాపాడాలి

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close