Featuredరాజకీయ వార్తలు

అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): టిఆర్‌ఎస్‌ అధికరాంలోకి రాకుంటే రాజకీయ సన్యసం తీసుకుంటానని మంత్రి కెటిఆర్‌ సంచలన ప్రకటన చేశారు. తనలాగు కాంగ్రెస్‌ నేతలు ఉతమ్మ చేయగలరా అని సవాల్‌ విసిరారు తెలంగాణలో బిజెపికి వంద సీట్లలో డిపాజిట్లు రావన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నాలుగేళ్లలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో అద్భుత పాలనను అందించామని, సంక్షేమం, అభివృ ద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచామని కేటీఆర్‌ అన్నారు. ప్రజలు తమ పాలన చూసి ఓటే యాలని కోరారు. గురువారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విూట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని కొందరు ఎద్దేవా చేశారని, వారి అంచనాలను తలకిందలు చేస్తూ, ప్రజలు మెచ్చేలా పాలన సాగించామని కేటీఆర్‌ అన్నా రు. 16రంగాల్లో తెలంగాణ దేశంలోని అగ్రగామిగా ఉందని అన్నారు. రాబోయే కాలంలో నవ తెలంగాణెళి లక్ష్యంగా ముందు కెళ్తున్నామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. విభజన సమయంలో లేవనెత్తిన అనుమానాలు తెరాస ప్రభుత్వ హయాంలో నివృత్తి అయ్యాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్‌ వేదికగా కేంద్రం పేర్కొన్న

విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేత కార్మికుల ఆత్మస్థైర్యం పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. 1956 నుంచి 2014 వరకు రంగారెడ్డి మినహా ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పాటు కాలేదన్నారు. పరిపాలన వికేంద్రీకరణ కోసమే తెరాస ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 3,400 గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉద్యమకారుడిగానే కాకుండా మంచి పాలకుడిగానూ నిరూపించుకు న్నారన్నారు. తెలంగాణ నాయకులకు పరిపాలన చేతకాదని ప్రచారం చేశారని, తలెత్తుకుని చెప్పుకునే విధంగా పాలించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలిచిందని చెప్పారు. భావితరాలకు విద్యుత్‌కోత అనే పదం తెలియకూడదనే 24 గంటల సరఫరాకు శ్రీకారం చుట్టామని కేటీఆర్‌ తెలిపారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను చరిత్ర పుటలకే పరిమితం చేయాలనే ఆలోచనతో ‘మిషన్‌ భగీరథ’ ప్రారంభించామని ఆయన వివరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో కయ్యానికి కాలుదువ్వకుండా స్నేహపూర్వకంగా వ్యవరించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం సగటున రూ.39.04కోట్లేనని.. నాలుగేళ్ల తెరాస పాలనలో సగటున ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్‌ చెప్పారు. తెరాస పాలనలో భూవివాదాలు, దందాలు లేకుండా చేశామన్నారు. పారదర్శక విధానంతో టీఎస్‌పీఎస్సీ ద్వారా కొలువులను భర్తీ చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును 90శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. తెరాస పాలనలో హైదరాబాద్‌లో కర్ఫ్యూ అనేదే లేకుండా చేశామని చెప్పారు. 40 ఏళ్ల ఇండస్ట్రీఅని చెప్పుకునే వాళ్లు ఆశ్చర్యపోయే విధంగా పాలన చేస్తున్నామని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

రాజకీయ సన్యాసం తీసుకుంటా..

డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్వయంగా అధికారంలోకి వస్తుందని, అలా రాకుంటే .. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఈ సవాల్‌ను స్వీకరించే ధైర్యం విపక్ష నేతలకు ఉందా అని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారని అన్నారు. ఆంధ్రా పార్టీ తెలుగుదేశంలో వారు పొత్తు పెట్టుకున్నప్పుడే వారికి సగం డిపాజిట్లు గల్లంతయినట్లు అయిందని, ప్రజలు కూటమి మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేసే వ్యక్తి అని కేటీఆర్‌ విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ స్వయం ప్రకాశంలేని చంద్రుడని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఒక్క వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. అవకాశం కోసం అందరితో పొత్తు పెట్టుకునే నైజం చంద్రబాబుదని, భవిష్యత్‌లో వైసీపీతో కూడా పొత్తుకుంటే ఆశ్చర్యపోనవసరంలేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాజపా 119 స్థానాల్లో పోటీ చేసినా 100 స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లను తెరాస గల్లంతు చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరిణతితో పనులు చేసుకుంటున్నారని తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ప్రధాని మోదీయే కితాబిచ్చారని చెప్పారు. తమ ప్రత్యర్థి ఇచ్చిన కితాబును చంద్రబాబులా ప్రచారం చేసుకునే అలవాటు తెరాసకు లేదన్నారు. మూడు సార్లు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు.. ఏనాడూ కూడా ఒంటరిగా గెలువలేదన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు అని కేటీఆర్‌ గుర్తు చేశారు. టీడీపీ పొత్తు పెట్టుకోని ఏకైక పార్టీ వైసీపీ. మిగతా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. చంద్రబాబు మాదిరిగా తమకు జబ్బలు చర్చుకునే అలవాటు లేదు. చార్మినార్‌కు తానే ముగ్గు పోశాను.. హైదరాబాద్‌ తానే కట్టాను అంటూ చంద్రబాబు చెప్పుకునే మాటలు విని ప్రజలు నవ్వుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనను బేరీజు వేసుకొని ఓటు వేయమని అడిగామని ఆయన తెలిపారు. చంద్రబాబు సర్టిఫికేట్లు, రాహుల్‌ భుజకీర్తులు తమకు అవసరం లేదు. సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి 7 సర్వేలు వచ్చాయి. అందులో ఆరు సర్వేలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చాయి. డిసెంబర్‌ 11న అసలు సర్వే వస్తుందన్నారు కేటీఆర్‌.

మంత్రి పదవే ఎక్కువ:

తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇంకా 15ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. కేసీఆర్‌ దయవల్ల మంత్రినయ్యానని, ప్రస్తుతం ఉన్న మంత్రి పదవే పెద్దది అనుకుంటు న్నానని మంత్రి అన్నారు. కేసీఆర్‌కు చెప్పకుండా జాబ్‌కు రిజైన్‌ చేసి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేశానన్నారు. అలాగే.. అద్భుతమైన పాలనతో ముందుకెళ్తున్నామని, ఆదాయాన్ని పెంచాలి… పేదలకు పంచాలన్నదే మా నినాదం అని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చాలని అనుకున్నానని, మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదని కేటీఆర్‌ చెప్పారు. మంత్రి పదవే తనకు ఎక్కువని అనుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. ఒకానొక దశలో కాంగ్రెస్‌లో తెరాసను విలీనం చేయాలని కూడా అనుకున్నామని కేటీఆర్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసీఆర్‌ వంటి నాయకుడు రాష్ట్రానికి 15ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నది తన ఆకాంక్ష అని వివరించారు. హైదరాబాద్‌లో ధర్నాచౌక్‌ను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని చెప్పారు. హైదరాబాద్‌ను తానే కట్టానంటూ చంద్రబాబు చెప్పుకునే మాటలు విని ప్రజలు నవ్వుకుంటారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాలనను బేరీజు వేసుకుని తమకు ఓటేయాలని ప్రజలను ఆయన కోరారు. తెరాస సొంతంగా అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మళ్లీ ప్రజలకు కనిపించనని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.

రైతు ఆత్మహత్యలు తగ్గాయ్‌:

రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్రమే పార్లమెంట్‌ వేదికగా చెప్పింది. 16 రంగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. నేత కార్మికుల ఆత్మైస్థెర్యం పెరిగేలా చేశాం. దివ్యాంగుల సంక్షేమంలోనూ ప్రథమ స్థానంలో నిలిచాం. భవిష్యత్‌ తరాల కోసమే మిషన్‌ భగీరథ, కాకతీయ చేపట్టాం. హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా గణనీయంగా మెరుగైంది. భావితరాలకు కరెంట్‌ కట్‌ అనే పదం తెలియకూడదనే ఉద్దేశంతోనే 24 గంటల కరెంట్‌ సరఫరాకు శ్రీకారం చుట్టాం. 80 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు చేశాం అని వివరించారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం. రాష్ట్రానికి పరిశ్రమలు తరలివస్తున్నాయి. పరిపాలన సంస్కరణలతో ఆదాయం సృష్టించి సంపద పెంచగలిగాం. సులభతర వాణిజ్యంలో దేశానికే ఆదర్శంగా ఉన్నాం. రాష్ట్రంలో కైం రేటు బాగా తగ్గింది. రాష్ట్రంలో పేకాట క్లబ్‌లు లేవు. భూ దందాలు లేవు. హైదరాబాద్‌లో కర్ఫ్యూ అనేది లేకుండా చేశాం. శాంతి భద్రతలను మెరుగు పరిచాం. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో కయ్యానికి కాలుదువ్వకుండా స్నేహపూర్వకంగా వ్యవహరించాం. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటాను తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును 90 శాతానికి పైగా పూర్తి చేశాం. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మూడంచెల విధానం అమలు చేశాం. లక్షా 9 వేల ఉద్యోగాలకు గానూ 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. విమర్శకులు సైతం అబ్బురపడేలా ఉద్యోగాల భర్తీ చేపట్టాం. సుమారు 40 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం. మిగతా ఉద్యోగాల భర్తీకి పక్రియ కొనసాగుతోంది. అవినీతి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, జర్నలిస్టుల సమస్యలపై తాను బాధ్యత తీసుకుంటానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్‌కార్డుల సమస్య పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. వెల్‌నెస్‌ సెంటర్‌ల ద్వారా ఇప్పటికే జర్నలిస్టులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి జర్నలిస్టులకు మళ్లీ అధికారం చేపట్టగానే

పరిష్కారంవైపు దృష్టిసారిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కాషాయానికి 100చోట్ల డిపాజిట్లు గల్లంతు

కేటీఆర్‌ జోస్యం

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాజపా 119 స్థానాల్లో పోటీ చేసినా 100 స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లను తెరాస గల్లంతు చేస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు గిల్లికజ్జాలు పెట్టుకుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరిణతితో పనులు చేసుకుంటున్నారని తమకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ప్రధాని మోదీయే కితాబిచ్చారని చెప్పారు. తమ ప్రత్యర్థి ఇచ్చిన కితాబును చంద్రబాబులా ప్రచారం చేసుకునే అలవాటు తెరాసకు లేదన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close