కారెక్కనున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌..?

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆ వైపునుంటావా.. నాగన్నా… ఈ వైపుకొస్తావా… అను పాటకు సరితూగే విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒక దశలో చెప్పాలంటే టిడిపి తెలంగాణాలో తుడిచిపెట్టుకుపోయినట్లే. అలాగే కాంగ్రెస్‌ పార్టీని కూడా తుదముట్టించేందుకు పావులు కదుపుతున్న కేసీఆర్‌ ఆకర్స్‌ నిజంగా ఆకర్షనకు గురవుతుంది. దీంతో రాజకీయతీర్ధం పుచ్చుకుని కాంగ్రెస్‌ పార్టీని వీడకుండా దశాబ్ధాల తరబడి ఆ పార్టీలోనే కొనసాగుతున్న నేతలు సైతం కారెక్కుతున్నారు. మొన్నటికి మొన్న ముగ్గురు కాంగ్రెస్‌, ఒక టిడిపి ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకోగా తాజాగా చేవెళ్ళ చెల్లమ్మ , హరిప్రియ తదితరులు కారెక్కనున్నారు. అయితే ఇక కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా లాభం లేదనుకున్న నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ అతి త్వరలో కారెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా ఇటీవల కారుకెక్కిన అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే లింగయ్య కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీపై నల్గొండ జిల్లా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిప్పులు చెరిగారు. పార్టీలో దళితులకు సరైన గౌరవం లేదన్నారు. పీసీసీ చీఫ్‌ ఓ సైకో అన్నారు. రాత్రి పన్నెండు గంటల వరకు నిద్రపోడని, ఉదయం పన్నెండు గంటల వరకు లేవడని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌ కోటు, గెడ్డం నుంచి దుర్వాసన వస్తోందన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విధానాలు నచ్చకనే తాను పార్టీ మారానని చిరుమర్తి లింగయ్య చెప్పారు. ఎవరి ప్రోద్భలంతోను తాను పార్టీ మారలేదని చెప్పారు. తాను రాజకీయంగా ఎదిగేందుకు కోమటిరెడ్డి సోదరులు తనకు ఎంతగానో సహకరించారని గుర్తు చేసుకున్నారు. వాళ్లు తెరాసలోకి వస్తారో రారో తనకు మాత్రం తెలియదని చెప్పారు. తాను పార్టీ మారడానికి ప్రధాన కారణం ఉత్తమ్‌ కుమర్‌ రెడ్డి విధానాలు నచ్చకపోవడమే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల్లో అధారణ ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో టిఆర్‌ఎస్‌ ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ఎన్నికల్లో తన నియోజకవర్గ ప్రజలకు (నకిరేకల్‌) చాలా హమీలు ఇచ్చానని, వాటిని నేరవేర్చాంటే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా తెరాసలో చేరడమే కరెక్ట్‌ అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీరుతో గాంధీ భవన్‌కు వచ్చే వారే కరువైయ్యారని చెప్పారు. రాహుల్‌ గాంధీ సభకు పదివేల మంది కూడా రాలేడంటే ఉత్తమ్‌ పని తీరు అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయంగా తనకు చాల సహకరించారన్నారు. తాను ఎవరి ప్రోద్బలంతో పార్టీ మారడం లేదని, తన నియోజకవర్గ ప్రజల అభివద్ది కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here