ఇద్దరి ప్రాణాలు తీసిన కోడిపందాలు

0

విజయవాడ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కోడిపందేలు కృష్ణాజిల్లాలో విషాదా న్ని నింపాయి. కోడిపందాల శిబిరాలపై పోలీసులు దాడి చేయ డంతో తప్పించుకునేందుకు యత్నిం చి బావిలో దూకడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చాట్రాయి మండలం చిత్తపూర్‌లో జరిగింది. గురువ ఆరం అర్ధరాత్రి ప్లెడ్‌లైట్ల వెలుతురులో చిత్తపూర్‌లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కోడిపందేల శిబిరాలపై దాడులు చేశారు. దీంతో నిర్వాహకులు పరుగులు పెట్టారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో చిత్తూరి శ్రీనివాసరావు(20), కుక్కల చెన్నకేశవరావు(26) అనే యువకులు బావిలో దూకారు. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గురువారంఅర్థరాత్రి ప్రమాదవశాత్తూ ఇద్దరు యువకులు నూతిలో పడి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించి, చనిపోయిన ఇద్దరు యువకులు విసన్నపేట మండలం కొండపర్వ గ్రామానికి చెందిన కుక్కల చెన్నారావు, చిత్తపూరు గ్రామానికి చెందిన చిట్టూరి శ్రీనులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here